సిరివెన్నెల మరణం: టాలీవుడ్‌ సెలబ్రిటీల స్పందన

తెలుగు సినిమా రంగానికి విలువలతో కూడిన సాహిత్యం అందించిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కలం నుంచి జాలువారిన పాటల్ని తలచుకుంటూ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.


ఎడమ భుజాన్ని కోల్పోయా: దర్శకుడు కె. విశ్వనాథ్‌

‘‘సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయినట్లు అనిపించింది. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన అనుకోకుండా మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యంకావడంలేదు. నమ్మలేని నిజం ఇది’’. 


మా అనుబంధం ఇప్పటిది కాదు: స్రవంతి రవికిశోర్‌.

‘‘అన్నయ్యతో నా అనుబంధం ఇప్పటిది కాదు. నిర్మాతగా నా తొలి చిత్రం ‘లేడీస్‌ టైలర్‌’లో అన్ని పాటలు ఆయనే రాశారు. బహుశా ఏ నిర్మాతకూ రాయనన్ని పాటలు నా సినివుమాలకు ఆయన రాశారు.  ఎంత బాగా రాసినా ఇంకా బాగా రాయాలని పరితపించేవారు. కరోనా తర్వాత ఆయన్ను కలవడం కుదర్లేదు. విషాద వార్తని వినాల్సి వస్తుందని ఊహించలేదు’’


మాలో నువ్వు ఉంటావు: నాగబాబు

‘‘గొప్ప ప్రతిభ అంతకు మించి గొప్ప వ్యక్తిత్వం.. రెండూ ఒకే దేహంలో ఇమిడిన వ్యక్తివి నువ్వు. అన్నయ్యా! అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోయావ్‌. నువ్వు రాసిన ప్రతీ పాట, ప్రతీ మాట ఎప్పటికీ మాతో ఉంటాయి. వాటిని ఆచరించే మాలో నువ్వు ఉంటావు’’


ఎప్పటికీ మరచిపోలేము: –రామ్‌ పోతినేని

‘‘మీ సాహిత్యంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో ేసవ చేసినందుకు ధన్యవాదాలు సిరివెన్నెలగారు. మీతో కలిసి పనిచేసినందుకు గౌరవంగా ఫీల్‌ అవుతున్నా. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేము’’


ఆయనొక లెజెండ్‌. – నటుడు సిద్థార్థ్‌

‘‘నా తొలి సినిమా సమయంలో తెలుగు నేర్చుకుంటున్నప్పుడు కవిత్వాన్ని ఎలా చదివాలో చెప్పారు.. తెలుగు భాషపై నాకు ప్రేమ కలిగేలా చేశారు’’


ఎంతో సేవ చేశారు – నటుడు నితిన్‌

‘‘సిరివెన్నెలగారు చనిపోయారన్న వార్త వినగానే షాకయ్యా. తన సాహిత్యంతో తెలుగు సినిమాకు ఎంతో ేసవ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరకుంటున్నా’’


‘‘సీతారామశాస్ర్తిగారు లేరన్న విషయం దిగ్ర్భాంతికి గురిచేసింది. ఎవరూ తీర్చలేని లోటు ఇది. తెలుగు సినిమాకి సిరివెన్నెలగారు చేసిన ేసవే ఆయన్ను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది’’

– సురేశ్‌ ప్రొడక్షన్స్‌


గురూజీ! అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోయావ్‌. నువ్వు రాసిన ప్రతీ పాట, ప్రతీ మాట ఎప్పటికి మాతో ఉంటాయి. వాటిని ఆచరించే మాలో నువ్వు ఉంటావు. 

– బండ్ల గణేశ్‌.


‘‘జగమంత కుటుంబం మీది. మీరు లేక ఏకాకి జీవితం మాది. మా జీవితాల్లో కవిత్వాన్ని నింపినందుకు ధన్యవాదాలు గురూజీ!  సిరివెన్నెల గారు లేని లోటు తీర్చలేనిది’’

– నటుడు ప్రకాశ్‌రాజ్‌

‘‘పాటే శ్వాసగా జీవిస్తూ.. వెంచితెర మీద సిరివెన్నెల కురిపించిన మా సీతారామశాస్ర్తి ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దివ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నా 

– పరుచూరి గోపాలకృష్ణ

‘‘సిరివెన్నెల సీతారామశాస్ర్తి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ 

– నందమూరి కల్యాణ్‌రామ్‌


‘‘మా అందరికీ ఆదర్శనీయుడు, మార్గదర్శకుడు. 1995 నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. సిరివెన్నెల చీకట్లో కలిసిపోయిందంటే నమ్మబుద్థి కావడం లేదు. ఆయన సిరా.. వెన్నెల. ఆయన ఏ పాట రాసినా మాకు మార్గదర్శకంగా ఉండేది. ‘నమేస్త అన్న’లో నేను రాసిన మొదటి పాట చూసి నన్ను ఆశీర్వదించిన గొప్ప మనసు ఆయనది. తెలుగు సినిమా పాటకు, సాహిత్యలోకానికి చాలా పెద్ద నష్టం. ఈ నష్టం పూరించేది కాదు. ఎవరూ ఆయన్ను అనుకరించలేరు. 

– సుద్దాల అశోక్‌తేజ


‘‘సిరివెన్నెల సీతారామశాస్ర్తిగారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు’’

– శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ.


ఇంకెక్కడి వెన్నెల.. తెలుగు పాటకు అమావాస్య. – దర్శకుడు హరీశ్‌ శంకర్‌.


ఆయన సాహిత్యంలో ‘సిరివెన్నెల’ మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడ్కోలు గురువు గారు: నటుడు నాని.అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.