యోగా భారతదేశానికి శ్వాస!
ABN , First Publish Date - 2021-06-21T20:14:03+05:30 IST
కథానాయికలకు అందంతో పాటు ఫిట్‌నెస్ ఎంతో అవసరం. దాని కోసం నిరంతరం జిమ్, వర్కవుట్లు అంటూ కసరత్తులు చేస్తూనే ఉంటారు అందాల భామలు. అందులో క్రమం తప్పకుండా ఫాలో అయ్యేది యోగా. ‘యోగా మన దేశానికి శ్వాస అనీ, యోగాతో ప్రశాంతత ఉంటుందని, శరీరాకృతి విషయంలోనే కాకుండా మానసికంగా ధృడంగా ఉండేలా చేస్తుందని’ హితవు పలుకుతున్నారీ బ్యూటీలు.

కథానాయికలకు అందంతో పాటు ఫిట్‌నెస్ ఎంతో అవసరం. దాని కోసం నిరంతరం జిమ్, వర్కవుట్లు అంటూ కసరత్తులు చేస్తూనే ఉంటారు అందాల భామలు. అందులో క్రమం తప్పకుండా ఫాలో అయ్యేది యోగా. ‘యోగా మన దేశానికి శ్వాస అనీ, యోగాతో ప్రశాంతత ఉంటుందని, శరీరాకృతి విషయంలోనే కాకుండా మానసికంగా ధృడంగా ఉండేలా చేస్తుందని’ హితవు పలుకుతున్నారీ బ్యూటీలు. వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా, అందంగా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటి? తమ సొగసు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అన్న విషయాలను సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ తారలు పంచుకున్నారు. ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం.
50 సూర్య నమస్కారాలు...
46 ఏళ్లు దాటిని ఇంకా నాజూగ్గానే కనిపిస్తారు శిల్పాశెట్టి. తన బాడీని విల్లులా వంచుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. ప్రతిరోజు ఉదయం 50 సూర్య నమస్కారాలు చేస్తారామె. అంతే కాదు యోగా మీద ఓ పుస్తకం కూడా రాశారు.
యోగా చేయడం వల్ల చేసే పని పట్ల ఏకాగ్రత పెరుగుతుందని దీపికా పడుకోన్ చెబుతున్నారు. షూటింగ్‌కు వెళ్లడానికి ముందు యోగా చేయడం ఆమెకు అలవాటని చెబుతున్నారు.
యోగా తన జీవితంలో కో భాగమైపోయిందంటున్నారు మాధురీ దీక్షిత్.
నటి శ్రియాశరన్ తన డేను అధో ముఖాసనంతో ప్రారంభిస్తారట!
మలైకా అరోరా, కాజల్, అలియాభట్ వంటి తారలు కూడా యోగా ప్రేమికులే!

మనం నిర్లక్ష్యం చేస్తున్నాం...
తన బ్యూటీకి, కామ్‌నెస్‌కి యోగా ప్రధాన కారణం అంటున్నారు మంచు లక్ష్మీ. తన కూతురుతో కూడా యోగాసనాలు వేయిస్తున్నారు. ‘‘విదేశాలు సైతం యోగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యోగా పుట్టిన మన దేశంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తుంది. మన భయాలను యోగా మటుమాయం చేస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుందిఃః అని ఆమె పేర్కొన్నారు.
యోగా ప్రేమికురాలు...
టాలీవుడ్ టాప్‌స్టార్ సమంత యోగ ప్రేమికురాలు. తను యోగా చేయడమే కాదు భర్త నాగచైతన్యతో కూడా ఆమె యోగా చేయిస్తుంటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

జీవితానికి అర్థం తెలిపింది: అనుష్కాశెట్టి
యోగా అనగానే టాలీవుడ్ కథానాయికల్లో మొదట గుర్తొచ్చే పేరు అనుష్కా శెట్టి. 20 సంవత్సరాలుగా యోగాతో ఆమె బంధం ముడిపడి ఉంది. భరత్ ఠాకూర్ ఆమెకు యోగా గురువు. అనుష్క యోగా నేర్చుకోవడమే కాదు. నేర్పిస్తారు కూడా. సినిమాల్లోకి రాకముందు ఆమె యోగా టీచర్‌గా పని చేశారు. ‘‘ఈ 20 ఏళ్ల యోగా జర్నీలో ఎంతోమందిని కలిశాను. ఎంతో నేర్చుకున్నా... అర్థం చేసుకున్నా, నేర్పించాను. యోగా ఈ జీవితానికి ఓ అర్థం తెలిపింది. ఇవన్నీ ఇంటా, బయట
నా ఎదుగుదలకు ఎంతో సహకరించాయి’’ అని అనుష్కా అంటున్నారు.
కుంజర క్రియతో...
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న విషయం అందరికీ తెలిసిందే! జిమ్‌తోపాటు తన డైలీ రొటీన్‌లో యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నేడు ఆమె కుంజర క్రియతో నా డే మొదలైంది.




