రెండు జట్ల మధ్య పోరు

ABN , First Publish Date - 2021-11-29T11:09:05+05:30 IST

యువన్‌, రిధాన్‌ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మడ్డీ’. పీకే 7 క్రియేషన్స్‌ పతాకంపై ప్రేమ కృష్ణదాస్‌ నిర్మించారు. ప్రభగల్‌ దర్శకుడు...

రెండు జట్ల మధ్య పోరు

యువన్‌, రిధాన్‌ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మడ్డీ’. పీకే 7 క్రియేషన్స్‌ పతాకంపై ప్రేమ కృష్ణదాస్‌ నిర్మించారు. ప్రభగల్‌ దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. డిసెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘మడ్‌ రేసింగ్‌ నేపథ్యంలో తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రమిది. దర్శకుడు ప్రభగల్‌కి రోడ్‌ రేసింగ్‌ లో అనుభవం ఉంది. దానిపై ఆయన ఐదేళ్ల రిసెర్చ్‌ చేశారు. రెండు వేర్వేరు జట్ల మధ్య పోరు, ఆ ఆటగాళ్ల మధ్య వైరం ఆకట్టుకుంటాయి. మడ్‌ రేసింగ్‌లో ఆటగాళ్లు రెండేళ్ల పాటు శిక్షణ పొందారు. ఎలాంటి డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించారు. మంగళవారం ట్రైలర్‌ విడుదల చేస్తున్నామ’’ని చిత్రబృందం తెలిపింది.


Updated Date - 2021-11-29T11:09:05+05:30 IST