Fathers day spl: రేపటి మనకు నిలువుటద్దం నాన్న..!
ABN , First Publish Date - 2022-06-19T23:29:28+05:30 IST
నాన్నంటే ఓ ఎమోషన్... ఆయన కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదనుకుంటాం... కన్నెరజేస్తే కఠిన హృదయమనుకుంటాం... మౌనంగా ఉంటే మాటలే ఇష్టంలేదనుకుంటాం.. అయితే వీటన్నిటి వెనుక కారణాలు చాలా ఉంటాయని... అది మనపైన అమితమైన ప్రేమని, బిడ్డల బాగు, బంగారు భవిత కోసం ఆరాటమని తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది.

నాన్నంటే ఓ ఎమోషన్... (Fathers day)
ఆయన కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదనుకుంటాం...
కన్నెరజేస్తే కఠిన హృదయమనుకుంటాం...
మౌనంగా ఉంటే మాటలే ఇష్టంలేదనుకుంటాం..
అయితే వీటన్నిటి వెనుక కారణాలు చాలా ఉంటాయని...
అది మనపైన అమితమైన ప్రేమని,
బిడ్డల బాగు, బంగారు భవిత కోసం ఆరాటమని తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది.
గెలిచినప్పుడు పదిమందికి గర్వంగా చెప్పుకొనే వ్యక్తి.. నాన్న.
ప్రపంచం వ్యతిరేకంగా ఉన్నా.. మనం ఓడినా..
నేనున్నానులే అని భుజం తట్టి ధైర్యం చెప్పే వ్యక్తి నాన్న..
అందుకే నాన్నంటే ఓ ఎమోషన్.
బిడ్డ గెలవడం కోసం ప్రతి రోజు ఆయన కృషి చేస్తుంటాడు..
బిడ్డల గెలుపు కోసం ఆయన ఎన్నోసార్లు ఓడిపోతుంటాడు.
రేపటి మనకు నిలువుటద్దం నాన్న..!
హ్యాపీ ఫాదర్స్ డే!!
ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా సినీతారలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాదర్స్ అందరికీ సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలిపారు. (Film celebs Fathers day wishes)
‘ఒక గొప్ప తనయుడిగా, గర్వించే తండ్రిగా అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫాదర్స్‌డేను పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం తన తండ్రి వెంకట్రావ్‌తో దిగిన ఓ ప్రత్యేక ఫొటోను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అలాగే మహేశ్‌బాబు, శ్రీనువైట్ల, బండ్ల గణేశ్, అజయ్ దేవగణ్, నితిన్, మంచు లక్ష్మి, సుఽధీర్‌బాబు తదితరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. (Chiranjeevi)
‘‘నాన్నా అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్నా.. మీరులేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు’’ అని మహేశ్‌బాబు ట్విట్టర్లో రాసుకొచ్చారు. (Mahesh babu)
‘‘ఈ విశ్వం సృష్టికి భగవంతుడు కారణమైతే.. మన సృష్టికి తల్లిదండ్రులు కారణం. అమ్మ నడక నేర్పితే.. నాన్న నడత నేర్పుతాడు. అందరికీ ఫాదర్స్ డే’’
– పరుచూరి గోపాలకృష్ణ.
‘‘నాన్నా.. నువ్వు నాకు జీవితం మాత్రమే ఇవ్వలేదు. ఎదురైన ప్రతి సమస్యను ఎలా ఎదుర్కొవాలి అన్నది నేర్పావు. కష్టాల్లో కూడా ఆనందంగా ఎలా జీవించాలో నేర్పించావు. నువ్వు లేకుండా మొదటిసారి ఫాదర్స్‌డే జరుపుకోవడం బాధగాఉంది, నిన్ను ఎంతో మిస్ అవుతున్నా’’
– శ్రీనువైట్ల