ఆ రోజున రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకొబోతున్న ఫర్హన్ అక్తర్

ABN , First Publish Date - 2022-01-14T21:12:24+05:30 IST

బాలీవుడ్‌లో గతేడాది అనేక మంది పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ, ఆదిత్య సీల్- అనుష్క రంజన్,

ఆ రోజున రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి  చేసుకొబోతున్న ఫర్హన్ అక్తర్

బాలీవుడ్‌లో గతేడాది అనేక మంది పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ, ఆదిత్య సీల్- అనుష్క రంజన్, విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ తదితరులందరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ఫర్హన్ అక్తర్-శిబానీ దండేకర్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ జంట తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే వారు దాంపత్య జీవితాన్ని ప్రారంభించబోతున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. 


ముంబైలో ఫిబ్రవరి 21న రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు పెళ్లి చేసుకొబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘‘ గత 3ఏళ్లుగా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. తమ బంధాన్ని వారు మరో మెట్టు ఎక్కించాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 21న దంపతులుగా కొత్త జీవితాన్ని  ప్రారంభించబోతున్నారు ’’ అని ఆ జంటతో సన్నిహితంగా మెలిగేవారు చెబుతున్నారు.  


ప్రస్తుతం ఫర్హన్ అక్తర్ ‘‘ జీ లే జరా’’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రంలో కత్రినా కైఫ్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ 2022 అర్ధబాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిత్రాన్ని 2023లో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఆ చిత్రం కొనసాగనున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఫర్హన్ అక్తర్ చివరిసారిగా  డాన్-2 సినిమాకు దర్శకత్వం వహించారు.

Updated Date - 2022-01-14T21:12:24+05:30 IST