వాన పాటలో KATRINA... RAVEENAకు టెన్షన్... ఎందుకంటే...

ABN , First Publish Date - 2022-01-17T22:30:56+05:30 IST

నిన్నటి తరం హాట్ బ్యూటీ రవీనా టాండన్. ఆమె కెరీర్‌లో ఆల్ టైం సక్సెస్‌ఫుల్ సాంగ్... ‘టిప్ టిప్ బర్సా పానీ’. అప్పట్లో రవీనా టాండన్ తడితడి అందాలు యూత్‌ను తల్లడిల్లేలా చేశాయి. అయితే, ఇప్పటికీ ఎంతో మందికి మోస్ట్ ఫేవరెట్ అయిన ఆ సెక్సీ సాంగ్ ‘సూర్యవంశీ’ సినిమాలో రీమిక్స్ చేశారు. అప్పుడూ, ఇప్పుడూ, రెండు సార్లూ అక్షయ్ కుమారే హాట్ బ్యూటీస్‌తో రొమాన్స్ చేశాడు. కానీ, అప్పట్లో రవీనా రచ్చ చేస్తే ఇప్పుడు కత్రీనా కలకలం రేపింది!

వాన పాటలో KATRINA... RAVEENAకు టెన్షన్... ఎందుకంటే...

నిన్నటి తరం హాట్ బ్యూటీ రవీనా టాండన్. ఆమె కెరీర్‌లో ఆల్ టైం సక్సెస్‌ఫుల్ సాంగ్... ‘టిప్ టిప్ బర్సా పానీ’. అప్పట్లో రవీనా టాండన్ తడితడి అందాలు యూత్‌ను తల్లడిల్లేలా చేశాయి. అయితే, ఇప్పటికీ ఎంతో మందికి మోస్ట్ ఫేవరెట్ అయిన ఆ సెక్సీ సాంగ్ ‘సూర్యవంశీ’ సినిమాలో రీమిక్స్ చేశారు. అప్పుడూ, ఇప్పుడూ, రెండు సార్లూ అక్షయ్ కుమారే హాట్ బ్యూటీస్‌తో రొమాన్స్ చేశాడు. కానీ, అప్పట్లో రవీనా రచ్చ చేస్తే ఇప్పుడు కత్రీనా కలకలం రేపింది!


ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్స్ మళ్లీ అదే లెవల్లో మ్యాజిక్ రిపీట్ చేయటం చాలా అరుదు. కానీ, ‘టిప్ టిప్ బర్సా’ రెండోసారి కూడా ‘వాహ్వా’ అనిపించింది. తెర మీద క్యాట్ నిలువునా తడిసిపోయి నిప్పు రాజేసింది. ఆమె అందానికి తెర వెనుక నుంచీ తోడైన ఫరా ఖాన్ కొరియోగ్రఫీ మరింత సొగసు తీసుకొచ్చింది. అయితే, ‘టిప్ టిప్ బర్సా’ లెటెస్ట్ వర్షన్‌కి ఫరా డ్యాన్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోందని తెలిసిన తరువాత పలుమార్లు రవీనా టాండన్ ఫోన్ చేసిందట. తన కెరీర్ బెస్ట్ సాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయవద్దని హెచ్చరించేదట! ఈ విషయం స్వయంగా ఫరా ఖానే చెబుతోంది! అయితే, ‘సూర్యవంశీ’ సినిమా కోసం రీక్రియేట్ చేసిన ‘టిప్ టిప్’ సాంగ్ పబ్లిక్‌లోకి విడుదల కాగానే మొదట ఫోన్ చేసి మెచ్చుకుంది కూడా రవీనానేనట! ‘‘అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశావ్’’ అంటూ పొగడ్తల్లో ముంచేసిందట! 

Updated Date - 2022-01-17T22:30:56+05:30 IST