Shah Rukh Khan: కొత్త లుక్‌లో బాద్ షా.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-09-26T14:24:59+05:30 IST

బాలీవుడ్‌లో టాప్ హీరోల్లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగాడు...

Shah Rukh Khan: కొత్త లుక్‌లో బాద్ షా.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

బాలీవుడ్‌లో టాప్ హీరోల్లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగాడు. ఈ నటుడికి కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే.. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా.. 2018లో చివరి సారి ప్రేక్షకులని పలకరించిన ఈ నటుడు.. అనంతరం ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. కానీ.. ఆయన హీరోగా మాత్రం మూవీ ఇంతవరకు రాలేదు. ఈ తరుణంలో ‘పఠాన్’ (Pathaan) అనే సినిమా చేస్తున్నాడు.


దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. ఈ తరుణంలో షారుఖ్ కొత్త పోస్టర్‌ని ఆయనే స్వయంగా విడుదల చేశాడు. అందులో.. ‘ఈ రోజు నా చొక్కాకి చెబుతున్నా.. నువ్వు ఉంటే ఎలా ఉండేది?. ఇది చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇది చూసి ఎంత నవ్వుతావేమో.. నువ్వు ఉంటే ఇలాగే ఉండేవాడిని. నేను కూడా పఠాన్ కోసం ఎదురు చూస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. అందులో షారుఖ్ సోఫాలో కూర్చుని.. కేవలం ప్యాంటుతో షర్ట్ లేకుండా ఉన్నాడు. ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసి పలువురు నెటిజన్లు షారుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


‘మూడు సంవత్సరాల తర్వాత షారుఖ్ రాబోతున్నాడు’.. ‘ఈ రోజు ట్విట్టర్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనంతమైన హాట్‌నెస్‌లో నిండిపోయింది. పఠాన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అంటూ వరుసగా ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహాం ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. కాగా.. ఓం శాంతి ఓం, హ్యాపి న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత నాలుగో సారి ఈ మూవీలో షారుఖ్, దీపిక కలిసి నటిస్తున్నారు.











Updated Date - 2022-09-26T14:24:59+05:30 IST