Pushpa the rise : సొంత గొంతుతో భన్వర్‌సింగ్ షెకావత్

ABN , First Publish Date - 2021-12-07T16:55:24+05:30 IST

నిన్న (సోమవారం) ‘పుష్ప’ ట్రైలర్ లేట్ గా విడుదలైనప్పటికీ.. ఆ విజువల్స్ కి, బన్నీ మాస్ పెర్ఫార్మెన్స్ కు తెగ ఫిదా అయిపోయారు అభిమానులు. నిన్న మొన్నటి వరకూ మామూలుగానే తెరమీద కనిపించిన సునీల్, అజయ్ ఘోష్, రవివర్మ, అనసూయ లాంటి నటీ నటులు సరికొత్త మేకవర్స్ తో కనిపించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. ఆ లిస్ట్ లో ఉన్న మరో సూపర్ కేరక్టర్ బన్వర్ సింగ్ షెకావత్ . ఫహద్ ఫాజిల్ చేస్తున్న ఆ పోలీస్ కేరక్టర్ గుండు, మీసాలతో ఆకట్టుకుంటోంది.

Pushpa the rise : సొంత గొంతుతో భన్వర్‌సింగ్ షెకావత్

నిన్న (సోమవారం) ‘పుష్ప’ ట్రైలర్ లేట్ గా విడుదలైనప్పటికీ.. ఆ విజువల్స్ కి, బన్నీ మాస్ పెర్ఫార్మెన్స్ కు తెగ ఫిదా అయిపోయారు అభిమానులు. నిన్న మొన్నటి వరకూ మామూలుగానే తెరమీద కనిపించిన సునీల్, అజయ్ ఘోష్, రవివర్మ, అనసూయ లాంటి నటీ నటులు సరికొత్త మేకవర్స్ తో కనిపించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. ఆ లిస్ట్ లో ఉన్న మరో సూపర్ కేరక్టర్ బన్వర్ సింగ్ షెకావత్ . ఫహద్ ఫాజిల్ చేస్తున్న ఆ పోలీస్ కేరక్టర్ గుండు, మీసాలతో ఆకట్టుకుంటోంది. నిజానికి ఫహద్ తన కెరీర్ లో పూర్తి గుండుతో ఏ మలయాళ సినిమాలో కూడా నటించలేదు. విలన్‌గా క్రూరత్వాన్ని పెర్ఫెక్ట్ గా పలికించడానికి సరిగ్గా పనికి వచ్చే పాత్ర అది. ఆ పాత్రతో నట విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు ఫహద్. 


ఇక ఈ సినిమాలో ఫహద్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ‘పుష్ప’ ట్రైలర్ లో ‘పార్టీ అయిందా ఫుష్పా’.. అనే ఫహద్ డైలాగ్ ఆయన సొంతంగా పలికిందే.  ఇది వరకు తెలుగులో ప్రత్యేక పాత్రలు పోషించిన మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ లాంటి మలయాళ స్టార్స్ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకొని.. అందులోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు ఫహద్ కూడా ‘పుష్ప’లో పెర్ఫెక్ట్ గా విలనిజం పలికించడం కోసం ప్రత్యేకించి ట్యూటర్ సాయంతో తెలుగు నేర్చుకుని తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషమని చెప్పాలి. మరి ‘పుష్ప’ సినిమాకి ఫహద్ విలనిజం ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2021-12-07T16:55:24+05:30 IST