మరో తమిళ చిత్రంలో Fahad Fazil

ABN , First Publish Date - 2022-05-25T21:12:32+05:30 IST

మాలీవుడ్ టాలెంటెడ్ హీరోల లిస్ట్‌లో మొదటగా వినిపించే పేరు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil). ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో రక్తికట్టించగలిగే సత్తా ఉన్న నటుడతడు. హీరోగానే కాకుండా.. నెగెటివ్ రోల్స్ చేయడంలో కూడా ఫహద్ చాలా సిద్ధహస్తుడు. ఆ మధ్య ‘కుంభళంగి నైట్స్’ (Kumbalangi Nights) అనే చిత్రంలో పూర్తిగా నెగెటివ్ రోల్ తో మెప్పించిన అతడికి.. ఆ టాలెంట్ తోనే ఇతర భాషల్లోనూ వరుసగా విలన్ వేషాలు వస్తున్నాయి.

మరో తమిళ చిత్రంలో Fahad Fazil

మాలీవుడ్ టాలెంటెడ్ హీరోల లిస్ట్‌లో మొదటగా వినిపించే పేరు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil). ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో రక్తికట్టించగలిగే సత్తా ఉన్న నటుడతడు. హీరోగానే కాకుండా.. నెగెటివ్ రోల్స్ చేయడంలో కూడా ఫహద్ చాలా సిద్ధహస్తుడు. ఆ మధ్య ‘కుంభళంగి నైట్స్’ (Kumbalangi Nights) అనే చిత్రంలో పూర్తిగా నెగెటివ్ రోల్ తో మెప్పించిన అతడికి.. ఆ టాలెంట్ తోనే ఇతర భాషల్లోనూ వరుసగా విలన్ వేషాలు  వస్తున్నాయి. తెలుగులో రీసెంట్ గా వచ్చిన అల్లు అర్జున్ (Allu Arjun)  ‘పుష్ప’  (Pushpa) చిత్రంలో ఫహద్ పాత్ర ఎలా పేలిందో అందరికీ తెలిసిందే.  భన్వర్‌సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫహద్ కు ఇప్పుడు కోలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. 


గతంలో శివకార్తికేయన్‌ (Shiva Karthikeyan) నటించిన ‘వేలైక్కారన్‌’ (VealaiKkaran) jచిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఫహద్. అందులో పూర్తిగా నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించాడు.  ప్రస్తుతం విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తో కలిసి అతడు నటించిన ‘విక్రమ్‌’ (Vikram) చిత్రం వచ్చే నెల 3న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఉదయనిధి (Udaya Nidhi) హీరోగా నటిస్తున్న ‘మామణ్ణన్‌’ (Maamannan) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు ఫహద్ . ఈ చిత్రం షూటింగ్‌ దక్షిణాది జిల్లాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫహద్ తన పాత్రకు సంబంధించిన షూటింగులో పాల్గొనేందుకు లొకేషన్‌కు చేరుకోగా, ఆయనకు దర్శకనిర్మాతలు, చిత్ర బృందం సాదర స్వాగతం పలికారు. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌, ప్రముఖ హాస్య నటుడు వడివేలు నటిస్తున్నాడు. మరి ఈ సినిమా హిట్టైతే ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) మరిన్ని తమిళ చిత్రాల్లో నటిస్తాడేమో చూడాలి. 

Updated Date - 2022-05-25T21:12:32+05:30 IST