F 3: సెన్సార్ పూర్తి..రన్ టైమ్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-05-20T18:22:26+05:30 IST

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్ 2 (F 2) చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 (F 3) రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయాయి. విక్టరీ వెంకటేష్ (Venkatesh)- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)

F 3: సెన్సార్ పూర్తి..రన్ టైమ్ ఎంతంటే..

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్ 2 (F 2) చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 (F 3) రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయాయి. విక్టరీ వెంకటేష్ (Venkatesh)- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా, తమన్నా భాటియా (Tamannaah Bhatia) - మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) వారికి జంటగా నటించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) స్పెషల్ సాంగ్‌లో అలరించబోతోంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీని 27 మే 2022న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 


ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీకి తాజాగా సెన్సార్ పూర్తైంది. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమాకి క్లీన్ యూ (U) సర్టిఫికేట్ వచ్చిందని మేకర్స్ తెలిపారు. 


అంతేకాదు, సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎఫ్ 3 సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. చాలాకాలం తర్వాత క్లీన్ అండ్ హెల్తీ ఎంటర్టైనర్‌ను వీక్షించినట్లు చెప్పారట. మొత్తానికి సెన్సార్ వారు కూడా పాజిటివ్‌గా చెప్పడంతో హిట్ అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - 2022-05-20T18:22:26+05:30 IST