హైకోర్టులో ARYAN KHAN లాయర్ నోట కన్నడ హీరోయిన్ పేరు

ABN , First Publish Date - 2021-10-26T22:42:51+05:30 IST

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు విచారణ బాంబే హైకోర్టులో కొనసాగుతోంది. ఆయన తరుఫున టాప్ లాయర్ ముకుల్ రోహత్గీ ఇవాళ్ల వాదనలు వినిపించారు. బాద్షా తనయుడికి ఎలాగైనా బెయిల్ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి...

హైకోర్టులో ARYAN KHAN లాయర్ నోట కన్నడ హీరోయిన్ పేరు

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు విచారణ బాంబే హైకోర్టులో కొనసాగుతోంది. ఆయన తరుఫున టాప్ లాయర్ ముకుల్ రోహత్గీ ఇవాళ్ల వాదనలు వినిపించారు. బాద్షా తనయుడికి ఎలాగైనా బెయిల్ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటిసారి రంగంలోకి దిగిన మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది పేరు న్యాయస్థానంలో ప్రస్తావించారు. ఆమెను కూడా గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆర్యన్ ఖాన్ కేసు కూడా అటువంటిదే అంటూ ఆయన వాదించారు. తన క్లైంట్‌కు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునేందుకు ఎన్సీబీకి చట్టపరమైన అవకాశాలు లేవని ఆయన చెప్పారు. 


డ్రగ్స్ కేసులో నిందితుల తరుఫున వాదిస్తోన్న లాయర్ రోహత్గీ ఎన్సీబీ అధికారుల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. వారు పోలీస్ అధికారులతో సమానమే అంటూ పాయింట్ లేవనెత్తారు. వారికి ఇచ్చిన స్టేట్మెంట్ కోర్టులో సాక్ష్యంగా చెల్లదని ఆయన వాదించారు. 


ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్స్ గురించి కూడా ముకుల్ రోహత్గీ న్యాయమూర్తి ముందు తమ వాదన వినిపించారు. ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్స్ ఇంత వరకూ కోర్టులో ఆన్ రికార్డ్ ప్రవేశపెట్టలేదని ఆయన గుర్తు చేశారు. కేవలం వాటిలో ఉన్న అంశాలు ప్రచారం మాత్రమే అవుతున్నాయని తెలిపిన ఆయన, ఆర్యన్ వాట్సప్‌లో ఎక్కడా క్రుయిజ్ పార్టీ గురించి లేదని, అన్నారు. అవన్నీ పార్టీ కంటే ముందు జరిపిన ఇతర సంభాషణలు మాత్రమేనని తెలిపారు. వాట్సప్ చాట్స్‌లో ఎక్కడా క్రుయిజ్ పార్టీ ఉసే లేదని స్పష్టం చేశారు...       



Updated Date - 2021-10-26T22:42:51+05:30 IST