శింబును అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు: శ్రీకాంత్
ABN , First Publish Date - 2022-02-09T19:11:54+05:30 IST
కోలీవుడ్ హీరో శింబును ప్రతి ఒక్కరూ తప్పుగానే అర్థం చేసుకున్నారని మరో హీరో శ్రీకాంత్ అన్నారు. అతను నటిం చిన కొత్త చిత్రం ‘ది బెడ్’ టీజర్ రిలీజ్ వేడుక నగరంలో జరిగింది. ఇందులో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..

కోలీవుడ్ హీరో శింబును ప్రతి ఒక్కరూ తప్పుగానే అర్థం చేసుకున్నారని మరో హీరో శ్రీకాంత్ అన్నారు. అతను నటిం చిన కొత్త చిత్రం ‘ది బెడ్’ టీజర్ రిలీజ్ వేడుక నగరంలో జరిగింది. ఇందులో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో శింబు ఒక అద్భుతమైన వ్యక్తి. అలాంటి ధైర్యం ప్రతి ఒక్కరికీ ఉండదు. హ్యాట్సాఫ్ టు శింబు. ఎందుకంటే. కొందరు శింబును సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన అద్భుతమైన వ్యక్తే కాదు మంచి నటుడు కూడా. చిత్రంలో నటించేందుకు అంగీకరించిన తర్వాత దర్శకుడికి సరెండర్ అయిపోతారు. ఇదిలా ఉండగా ‘కరోనా కష్టకాలంలో ఇలాంటి కార్యక్రమం వద్దని వారించాను. కానీ, నిర్మాత, పీఆర్వోలు ఎంతో నమ్మకంతో ఈ వేడుకను నిర్వ హించేలా చేశారు. ముందు ఈ చిత్రం టైటిల్ వినగానే వెనుకంజ వేశాను. లేనిపోని వివాదానికి దారితీస్తుందని భావించాను. ‘ది బెడ్’ సినిమా కథ ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేలా తెరకెక్కించారు’ అని హీరో శ్రీకాంత్ అన్నారు.
హీరోయిన్ సృష్టి డాంగే మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం లో నటించేటపుడు కొన్ని సమయాల్లో చలిజ్వరం కూడా వచ్చింది. అలాంటి సమయంలో హీరో శ్రీకాంత్ ఎంతగానో సహకరించారు’ అని వెల్లడించింది. నిర్మాత మదియళగన్ మాట్లాడుతూ, ‘నేను నిర్మించే ‘మహా’ చిత్రంలో శ్రీకాంత్ నటించారు. 20 యేళ్ళ క్రితం ‘రోజాకూట్టం’ నిర్మించేటపుడు చూసిన శ్రీకాంత్‌నే ఇపుడు చూస్తున్నాను. ‘ది బెడ్’ సినిమా చాలా బాగా తీశారు అని వివరించారు. దర్శకుడు ఎస్.మణి భారతి రూపొందించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, సృష్టిడాంగే, జాన్ విజయ్, బ్లాక్ పాండి, విజయ్, దేవిప్రియ, దివ్య, రిషా, టిక్‌టాక్ తిరుచ్చి సాధనా, విక్రమ్ ఆనంద్, ప్రవీణ్ కుమార్ తదితరులు నటించారు. శ్రీనిధి ప్రొడక్షన్స్, ఆంజేయ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వి.విజయ కుమార్, లోకేశ్వరి విజయకుమార్, కె.కందస్వామి, కె.గణేశన్ నిర్మాతలుగా వ్యవహరించారు.
