షారూక్ అలా కనిపించిన ప్రతిసారి నేను వాంతులు చేసుకునేదానిని: ఫరా ఖాన్

ABN , First Publish Date - 2021-11-28T01:57:15+05:30 IST

ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి స్టార్ కొరియోగ్రఫర్ అయిన ఫరా ఖాన్ అభిమానులతో పంచుకుంది.

షారూక్ అలా కనిపించిన ప్రతిసారి నేను వాంతులు చేసుకునేదానిని: ఫరా ఖాన్

ఒక సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి స్టార్ కొరియోగ్రఫర్ అయిన ఫరా ఖాన్ అభిమానులతో పంచుకుంది. షారూక్ షర్ట్ లెస్‌గా కనిపించిన  ప్రతిసారి తను వాంతులు చేసుకునే దానినని ఆమె పేర్కొంది. ఓం శాంతి ఓం సినిమా షూటింగ్ సమయంలో ఆ ఘటనలు జరిగాయని ఆమె  వెల్లడించింది.


షారూక్ ఖాన్, ఫరా ఖాన్ సన్నిహిత మిత్రులని బాలీవుడ్‌లో అందరికి తెలిసిందే. కొరియోగ్రాఫర్‌గా బీ టౌన్‌కు  ఎంట్రీ ఇచ్చినప్పటికి అనంతరం డైరెక్టర్‌గా ఆమె మారింది. షారూక్ హీరోగా నటించిన ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ తదితర సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆమె దర్శకత్వం వహించిన ‘‘ఓం శాంతి ఓం’’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమాలోని అన్ని పాటలు హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కింగ్ ఖాన్ షర్ట్‌లెస్‌గా కనిపించిన డర్డ్-ఏ-డిస్కో పాట బాలీవుడ్‌లో ట్రెండ్‌ను  సృష్టించింది. 


తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘‘ ఓం శాంతి ఓం షూటింగ్ చివరి దశ కొచ్చే సరికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. డర్డ్-ఏ-డిస్కో పాటను కూడా చిత్రీకరించాల్సి ఉంది. కింగ్ ఖాన్ షర్ట్‌ లెస్‌గా కనిపించిన ప్రతిసారి నేను వాంతులు చేసుకునేదానిని. నేను ప్రెగ్నెంట్ కావడం వల్ల ఆ వాంతులు  వచ్చాయని, అతడు షర్ట్ లెస్‌గా కనిపించినందుకు కాదని నేను చెప్పేదానిని. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించేది ’’ అని ఫరా ఖాన్ చెప్పింది. ఓం శాంతి ఓం సినిమా 2014లో విడుదలైంది. దీపికా పదుకొణె, షారూక్ ఖాన్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2021-11-28T01:57:15+05:30 IST