సంక్రాంతికి ‘ఈటి’ ట్రైలర్‌

ఇటీవల ‘జై భీమ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అగ్రహీరో సూర్య ప్రస్తుతం ‘ఎదర్కుమ్‌ తుణిందవన్‌’ (ఈటీ) అనే చిత్రంలో నటిస్తున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా.. సత్యరాజ్‌, శరణ్య, సూరి తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు కొన్ని లిరికల్‌ సాంగ్‌ లను రిలీజ్‌ చేయగా, వాటికి మంచి స్పందన వచ్చింది. వచ్చే నెల నాలుగో తేదీన విడుదల చేసేలా ప్లాన్‌ చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ను సంక్రాంతికి రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.