3న జీ తమిళ్‌లో.. 8 నుండి జీ5లో!!

ABN , First Publish Date - 2021-09-30T02:51:58+05:30 IST

ఈ చిత్రం ప్రధానంగా బాల కార్మికవ్యవస్థ, పశువుల(ఎద్దులు) పెంపకం, ప్రపంచీకరణ వంటి అంశాలను టచ్‌ చేస్తూ సాగుతుంది. బాల కార్మికులు పడే కష్టాలను ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఇందులో హీరో..

3న జీ తమిళ్‌లో.. 8 నుండి జీ5లో!!

విధార్థ్‌, రమ్యా నంబీశన్‌ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ‘ఎండ్రావదు ఒరు నాల్‌’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ముందుగా జీ తమిళ్‌లో వచ్చే నెల 3 తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు టెలికాస్ట్‌ చేస్తున్నారు. ఆ తర్వాత 8న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. వెట్రి దురైస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ రెండేళ్ళ కిత్రమే పూర్తి చేసుకుంది. కానీ, కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. అయితే, ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. దర్శక నిర్మాతలు మాత్రం ఓటీటీ వైపే మొగ్గు చూపారు. 


తాజాగా ఈ చిత్ర దర్శకుడు వెట్రి దురైస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ప్రధానంగా బాల కార్మికవ్యవస్థ, పశువుల(ఎద్దులు) పెంపకం, ప్రపంచీకరణ వంటి అంశాలను టచ్‌ చేస్తూ సాగుతుంది. బాల కార్మికులు పడే కష్టాలను ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఇందులో హీరో విధార్థ్‌ భార్యగా రమ్యా నంబీశన్‌, వీరి కుమారుడిగా మాస్టర్‌ రాఘవన్‌ నటించారు. ది థియేటర్‌ పీపుల్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి ఎన్‌.ఆర్‌.రఘునందన్‌ సంగీతం సమకూర్చగా అన్ని పాటలను కవి పేరరసు వైరముత్తు రాశారు..’’ అని చెప్పారు. కాగా, ఇటీవల వచ్చిన ‘రామే అండాలుం రావణే ఆండాలుం’ చిత్ర కథకు దీనికి ఎలాంటి పోలిక లేదని, ఈ రెండు చిత్రాల్లో రెండు ఎద్దులుండటం ఒక్కటే కామన్‌ అని హీరో విధార్థ్‌ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇదిలావుంటే, ఈ చిత్రం వివిధ చిత్రోత్సవాల్లో ఇప్పటివరకు వివిధ విభాగాల్లో ఏకంగా 43 అవార్డులు గెలుచుకోవడం గమనార్హం. 

Updated Date - 2021-09-30T02:51:58+05:30 IST