ఎమోషనల్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2021-10-20T09:14:19+05:30 IST

‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘పడేసావే’, ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ చిత్రాల కథానాయకుడు కార్తీక్‌ రాజు నటించిన తాజా చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తీ చక్రవర్తి ఈ చిత్ర కథానాయిక....

ఎమోషనల్‌ థ్రిల్లర్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘పడేసావే’, ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ చిత్రాల కథానాయకుడు కార్తీక్‌ రాజు నటించిన తాజా చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తీ చక్రవర్తి ఈ చిత్ర కథానాయిక. సందీప్‌ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా ఉంది. చిత్రం కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని అనుకుంటున్నాను’ అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌గా  ఫీలయ్యే ఎన్నో అంశాలు చిత్రంలో ఉన్నాయి. షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌ విడుదల చేస్తాం’ అని సందీప్‌ గోపిశెట్టి చెప్పారు. 


Updated Date - 2021-10-20T09:14:19+05:30 IST