మొదటి స్థానంలో ‘పుష్ప’.. తర్వాతి స్థానంలో ‘ఏకమ్’

ABN , First Publish Date - 2022-01-23T01:02:19+05:30 IST

అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో మొదటి స్థానంలో ఉన్న ‘పుష్ప’ సరసన సగర్వంగా రెండో స్థానంలో ‘ఏకమ్’ చిత్రం నిలిచి అందరినీ అలరిస్తున్నందుకు ఆ చిత్ర దర్శకుడు వరుణ్ వంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై

మొదటి స్థానంలో ‘పుష్ప’.. తర్వాతి స్థానంలో ‘ఏకమ్’

అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో మొదటి స్థానంలో ఉన్న ‘పుష్ప’ సరసన సగర్వంగా రెండో స్థానంలో ‘ఏకమ్’ చిత్రం నిలిచి అందరినీ అలరిస్తున్నందుకు ఆ చిత్ర దర్శకుడు వరుణ్ వంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్ వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎ. కళ్యాణ్ శాస్త్రి - పూజ. ఎమ్ - శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఏకమ్’. ‘ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్’ అనేది ఉపశీర్షిక. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను రాబట్టుకుంటోంది. 


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ..‘‘అమెజాన్ ప్రైమ్ 503వ చిత్రంగా విడుదలైన మా ‘ఏకమ్’ చిత్రం.. కేవలం పదిహేను రోజుల్లో టాప్-2 స్థానానికి చేరుకోవడం కలలా అనిపిస్తుంది. అందునా మొదటి స్థానంలో ఉన్న ‘పుష్ప’ సరసన మా చిత్రం కూడా నిలిచినందుకు చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా... తాత్విక చింతనకు ఆధునికతను జోడించి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అమెజాన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు తెలుగులో రానటువంటి యూనీక్ జోనర్ ఇది. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రమే అవార్డులు, రివార్డులు తెచ్చిపెడుతుందని అస్సలు ఊహించలేదు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

Updated Date - 2022-01-23T01:02:19+05:30 IST