నొటోరియస్ క్రిమినల్ ‘కురుప్’ గా దుల్కర్.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

ABN , First Publish Date - 2021-11-05T00:58:36+05:30 IST

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘కురుప్పు’ మలయాళ మూవీకిది డబ్బింగ్ వెర్షన్. పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 12న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమా రూపొందింది.

నొటోరియస్ క్రిమినల్ ‘కురుప్’ గా దుల్కర్.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘కురుప్పు’ మలయాళ మూవీకిది డబ్బింగ్ వెర్షన్. పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 12న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమా రూపొందింది. శోభితా ధూళిపాళ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఇంకా ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టాక్ చాకో, టోవినో థామస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రోమోషన్స్ లో భాగంగా బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఐదు భాషల్లోనూ విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.



1984లో కేరళ రాష్ట్రాన్ని గడగడలాడించిన నొటోరియస్ క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చాకో అనే యువకుణ్ని రూ. 8లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దహనం చేసి చంపి.. తానే చనిపోయినట్టు నాటకమాడి.. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు కురుప్పు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడికోసం వెతుకుతునే ఉన్నారు కేరళ పోలీసులు.  కురుప్పుగా దుల్కర్ సల్మాన్ అద్భుతమైన పెర్ఫార్మాన్స్ ఇచ్చారు. అలాగే.. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వ ప్రతిభ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. మహానటితో తెలుగువారికి బాగా దగ్గరైన దుల్కర్ .. ఇప్పుడీ సినిమాతో ఇంకెంత క్రేజ్ తెచ్చుకుంటారో చూడాలి.



Updated Date - 2021-11-05T00:58:36+05:30 IST