వైరల్ అవుతోన్న దుల్ఖర్ సల్మాన్ డ్యాన్స్ వీడియో

ABN , First Publish Date - 2022-01-19T22:05:08+05:30 IST

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ నటిస్తోన్న తమిళ చిత్రం ‘హే సినామిక’. కొరియో గ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాలోని ‘అచ్చమిల్లై అచ్చమిల్లై’ అనే పాట రిహార్సల్స్ కు దుల్ఖర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన వేసిన అద్భుమైన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. దుల్ఖర్ మంచి డ్యాన్సర్ ఆ స్టె్ప్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది.

తాజాగా తన ఫేస్ బుక్ పేజ్ లో ఆ రిహార్సల్స్ తాలూక వీడియోను పోస్ట్ చేశారు దుల్ఖర్. అలాగే.. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన మూడురోజుల్లోనే ఆ పాట 3 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా దర్శకురాలు బృంద మాస్టర్ కు దుల్ఖర్ థాంక్స్ చెప్పాడు. తన మిస్టేక్స్ కవర్ చేస్తూ బాగా ఎడిట్ చేసి సాంగ్ ను వదలినందుకు ధన్యవాదాలు తెలిపాడు. దీనివల్ల మరిచిపోయిన తన స్టెప్స్ ను గుర్తు చేశారని పేర్కొన్నాడు.  

Updated Date - 2022-01-19T22:05:08+05:30 IST