Dulquer - Hanu movie : హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి !

ABN , First Publish Date - 2021-12-06T17:22:35+05:30 IST

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లోని సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఇందులో దుల్ఖర్ లెఫ్టినెంట్ గా నటిస్తున్నారు. స్వప్న ఫిల్మ్స్ , వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్స్ పై నిర్మాణం జరుపుకుంటోంది ఈ సినిమా. వార్ అండ్ లవ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘లెఫ్టినెంట్ రామ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మిలటరీ బేస్ లో తెరకెక్కుతున్నప్పటికీ.. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథా చిత్రమని చెబుతున్నారు మేకర్స్.

Dulquer - Hanu movie : హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి !

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లోని సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఇందులో దుల్ఖర్ లెఫ్టినెంట్ గా నటిస్తున్నారు. స్వప్న ఫిల్మ్స్ , వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్స్ పై నిర్మాణం జరుపుకుంటోంది ఈ సినిమా. వార్ అండ్ లవ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘లెఫ్టినెంట్ రామ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మిలటరీ బేస్ లో తెరకెక్కుతున్నప్పటికీ.. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథా చిత్రమని చెబుతున్నారు మేకర్స్. ఇటీవల ఈ సినిమా హిమాచల్ ప్రదేశ్ లో 9 రోజుల షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దుల్కర్ సల్మాన్ తన ఫేస్ బుక్ పేజ్ లో తెలియచేస్తూ దానికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేశారు. 


‘అందాల రాక్షసి’ మూవీతో దర్శకుడిగా అడుగుపెట్టిన హను రాఘవపూడి.. ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడిపడిలేచె మనసు’ చిత్రాల్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలన్నీ హనుకి తీవ్ర నిరాశనే కలిగించాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. దుల్ఖర్ లాంటి మంచి పెర్ఫార్మర్ తో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరి ‘లెఫ్టినెంట్ రామ్’ చిత్రం దర్శకుడిగా హను రాఘవపూడికి మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిద్దాం.  



Updated Date - 2021-12-06T17:22:35+05:30 IST