Dulquer Salmaan: రిలీజ్ రోజు అందుకే ఏడ్చా
ABN , First Publish Date - 2022-08-09T22:33:31+05:30 IST
ఓటీటీలు విజృంభించడం, సినిమా టికెట్ రేట్టు పెరగడంతో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? లేదా అన్న భయంతో ఉన్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలకే ప్రాప్తం లేదంటే కష్టమే అన్న మాటలు ఈ మధ్యకాలంగా గట్టిగానే వినిపిస్తున్నాయి. పైగా గత నెల వరుస పరాజయాలు చవిచూడడంతో ఆ టెన్షన్ ఇంకాస్త పెరిగింది.
ఓటీటీలు విజృంభించడం, సినిమా టికెట్ రేట్టు పెరగడంతో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? లేదా అన్న భయంతో ఉన్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలకే ప్రాప్తం లేదంటే కష్టమే అన్న మాటలు ఈ మధ్యకాలంగా గట్టిగానే వినిపిస్తున్నాయి. పైగా గత నెల వరుస పరాజయాలు చవిచూడడంతో ఆ టెన్షన్ ఇంకాస్త పెరిగింది. అయితే ఈ నెల ప్రారంభంలో విడుదలైన చిత్రాలు నిర్మాతలకు కాస్త ఊరట కలిగించాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు ఏ మూలన ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా థియేటర్లు వస్తారని, సినిమాకు భారీ విజయం అందిస్తారని నిరూపించింది ‘సీతారామం’.(Sita Ramam) ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సక్సెస్ను ఆస్వాదిస్తున్న రామ్ పాత్రధారి దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)భావోద్వేగంగా ఓ లేఖ రాశారు.
‘‘నేను నటించగా తెలుగులో అనువాదమైన తొలి చిత్రం ‘ఓకే బంగారం’ ఇక్కడ పెద్ద విజయం సాధించింది. అందుకు మణిరత్నంగారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత నాగ్ అశ్విన్, వైజయంతి సంస్థ ‘మహానటి’లో జెమిని గణేశ్ర్గా నెగెటివ్ పాత్ర ఇచ్చారు. అది కూడా చక్కని విజయాన్ని అందించింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ‘కనులు కనులు దోచాయంటే’, ‘కురుప్’ చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. ఇలా ప్రతి సినిమాను ఆదరిస్తూ నామీద ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులను ఎప్పటికీ మరువలేను. (Dulquer Salmaan Emotional letter) ‘సీతారామం’ కోసం స్వప్న, హను నన్ను అడిగినప్పుడు ‘ఎప్పటినుంచో ఇలాంటి యునిక్ కథతో తెలుగులో స్ర్టెయిట్ సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పా. అయితే ఈ లైన్ వినగానే సేఫ్ జోన్ అనిపించింది. పాత్ బ్రేకింగ్ కథతో రావాలనుకుంటున్న తరుణంలో ఇదొక క్వాలిటీ సినిమా అనిపించి ‘సీతారామం’ జర్నీ ప్రారంభించా. మా టీమ్ అందరి ఎఫర్ట్ వల్లే ఇంత అందమైన సినిమా తయారైంది. సినిమా విడుదల రోజు ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన చూసి ఆనందంతో ఏడ్చేశాను. మా మీద ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఏం చెప్పాలో.. ఎలా చెప్పాల్లో కూడా అర్థం కావడం లేదు. సినిమాను ప్రేమించే ప్రతి తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని దుల్కర్ ఆ లేఖలో రాసుకొచ్చారు.