నాలుగు భాషల్లోనూ డబ్బింగ్
ABN , First Publish Date - 2021-12-16T05:54:53+05:30 IST
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ వచ్చే నెల ఏడున విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది...

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ వచ్చే నెల ఏడున విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో తను పోషించిన కొమురం భీమ్ పాత్ర కోసం మలయాళం మినహా మిగిలిన అన్ని భాషల్లోనూ తారక్ డబ్బింగ్ చెప్పడం విశేషం. నిజం చెప్పాలంటే తారక్‌తో ఇలా నాలుగు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పించాలన్నది దర్శకుడు రాజమౌళి ఆలోచన. ఆయన చెప్పగానే ఛాలెంజ్‌గా తీసుకుని డబ్బింగ్ పూర్తి చేశారు ఎన్టీఆర్. తమిళ, హిందీ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉంది. అలాగే ఆయన మదర్ కన్నడ మహిళ కావడంతో కన్నడం కూడా బాగా వచ్చు. తల్లి చెప్పడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ భాషలోనూ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. ఓన్ వాయిస్‌తో ఇలా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఆర్టిస్టుకు ఎప్పుడూ అడ్వాంటేజ్ అవుతుంది. మలయాళ భాషలో మాత్రం ఎన్టీఆర్‌కు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. ఓలివియా మోరిస్, అలియాభట్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని హయ్యెస్ట్ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.