డయ్యూ షెడ్యూల్‌ కంప్లీట్‌

ABN , First Publish Date - 2021-12-06T06:46:42+05:30 IST

అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘రామ్‌ సేతు’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇటీవలె ఊటీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రయూనిట్‌ తాజాగా డయ్యూలో...

డయ్యూ షెడ్యూల్‌ కంప్లీట్‌

అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘రామ్‌ సేతు’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇటీవలె ఊటీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రయూనిట్‌ తాజాగా డయ్యూలో జరిగిన షెడ్యూల్‌ను ముగించింది. అక్షయ్‌ ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. ఈ చిత్రంలో ఆయన పురాతత్వశాస్త్రవేత్తగా కనిపించనున్నారు. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ బరూచా కథానాయికలు. అభిషేక్‌ శర్మ దర్శకుడు. అరుణా భాటియా, విక్రమ్‌ మల్హోత్రా నిర్మాతలు. తెలుగు నటుడు సత్యదేవ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 


Updated Date - 2021-12-06T06:46:42+05:30 IST