‘దృశ్యం 2’ రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

ABN , First Publish Date - 2021-07-23T17:20:56+05:30 IST

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నారప్ప’ రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వెంకీ హీరోగా న‌టించిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది.

‘దృశ్యం 2’ రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నారప్ప’ రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వెంకీ హీరోగా న‌టించిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘దృశ్యం 2’  మేక‌ర్స్ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల చేయ‌డానికి డీల్ పూర్తి చేసుకున్నారని టాక్‌. లేటెస్ట్‌గా ఈ సినిమాను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9 లేదా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయాల‌ని హాట్‌స్టార్ ప్ర‌తినిధులు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డుతుంద‌ట‌.


మోహ‌న్‌లాల్ ‘దృశ్యం’కు సీక్వెల్‌గా వ‌చ్చిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలోనే విడుద‌లై తిరుగులేని విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. అదే స్ఫూర్తితో తెలుగు ‘దృశ్యం’లో హీరోగా చేసిన వెంక‌టేశ్ ‘దృశ్యం2’ను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. మార్చి నెలలో ప్రారంభమైన ‘దృశ్యం 2’ చిత్రం ఏకధాటిగా 45 రోజులు షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేశారు. మ‌లయాళ ‘దృశ్యం 2’ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు ‘దృశ్యం 2’ను డైరెక్ట్ చేశాడు. 

Updated Date - 2021-07-23T17:20:56+05:30 IST