Aryan Khan కేసులో అనూహ్య పరిణామం.. తెరపైకి మరో హీరోయిన్ పేరు..!

ABN , First Publish Date - 2021-10-20T18:15:31+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు (బుధవారం) మరోసారి విచారణ జరగబోతోంది.

Aryan Khan కేసులో అనూహ్య పరిణామం.. తెరపైకి మరో హీరోయిన్ పేరు..!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు (బుధవారం) మరోసారి విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంచలన విషయం బయటపెట్టింది. ఓ కొత్త హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి వాట్సాప్ ఛాట్ చేసినట్టు వెల్లడించింది. వెండితెరకు కొత్తగా పరిచయమైన ఓ హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌కు సంబంధించి ఛాటింగ్ చేశాడని కోర్టుకు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. 


డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ రోజు మరోసారి విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీబీ తరఫు న్యాయవాది కోర్టుకు ఆర్యన్ వాట్సాప్ ఛాట్‌ను సమర్పించారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై సెషన్స్ కోర్టు ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. తీర్పు ఎలా వస్తుందోనని షారూక్ కుటుంబం మాత్రమే కాదు.. బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

Updated Date - 2021-10-20T18:15:31+05:30 IST