రిలీజ్‌కు రెడీ
ABN , First Publish Date - 2021-11-13T05:00:23+05:30 IST
రాంబాబు గుర్తున్నాడు కదా? ఓ మధ్యతరగతి నాన్న... పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తన కుటుంబాన్ని, తనకున్న సినీ పరిజ్ఞానంతో కాపాడుకున్నాడు. అదే.. ‘దృశ్యం’లో చూశాం. ఇప్పుడు రాంబాబు...

దృశ్యమ్2
విడుదల: నవంబరు 25
రాంబాబు గుర్తున్నాడు కదా? ఓ మధ్యతరగతి నాన్న... పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తన కుటుంబాన్ని, తనకున్న సినీ పరిజ్ఞానంతో కాపాడుకున్నాడు. అదే.. ‘దృశ్యం’లో చూశాం. ఇప్పుడు రాంబాబు మళ్లీ వస్తున్నాడు. తన కుటుంబానికి మరోసారి రక్షణ కవచంలా నిలవబోతున్నాడు. ‘దృశ్యమ్ 2’లో. వెంకటేష్, మీనా జంటగా నటించిన చిత్రమిది. నదియా, సంపత్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈనెల 25న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కాబోతోంది. శుక్రవారం టీజర్ రిలీజ్ అయ్యింది.
మాచర్ల నియోజక వర్గం
విడుదల: ఏప్రిల్ 29
పొలిటికల్ థ్రిల్లర్స్‌కి ఈమధ్య మంచి గిరాకీ ఏర్పడింది. యువ కథానాయకులు కూడా అలాంటి కథల్ని ఎంచుకుంటున్నారు. ఎప్పుడూ ప్రేమకథలపై దృష్టి సారించే నితిన్ కూడా తొలిసారి ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. అదే... ‘మాచర్ల నియోజక వర్గం’. కృతి శెట్టి కథానాయిక. ఎం.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. ఈచిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నారు. ‘‘ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. నితిన్ ని ఇదివరకెప్పుడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నామ’’న్నారు దర్శకుడు.