అక్రమ సంబంధాల నేపథ్యంలో..

ABN , First Publish Date - 2021-11-25T23:25:01+05:30 IST

సందీప్‌ పగడాల, నవ్య రాజ్‌ జంటగా దేవి ఫిలిం ఫ్య్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్‌ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా ‘దొరకునా ఇటువంటి ేసవ’. ‘ఏ డేంజరస్‌ ఫ్యామిలీ గేమ్‌’... అనేది ఉపశీర్షిక. డిసెంబర్‌ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అక్రమ సంబంధాల నేపథ్యంలో..

సందీప్‌ పగడాల, నవ్య రాజ్‌ జంటగా దేవి ఫిలిం ఫ్య్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్‌ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా ‘దొరకునా ఇటువంటి సేవ’. ‘ఏ డేంజరస్‌ ఫ్యామిలీ గేమ్‌’... అనేది ఉపశీర్షిక. డిసెంబర్‌ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్ర్కీన్‌ మ్యాక్స్‌ పిక్చర్స్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మంచి విషయం చెబుతూ సినిమా తీయడం చాలా సులభం. సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగే నేరాలు విపరీతంగా పెరిగాయి. ప్రతి పదిమందిలో ఏడుగురు అక్రమ సంబంధాలను ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. క్షణికానందం కోసం ఎవరైనా అడ్డొస్తే.. చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో కథతో ఈ చిత్రం రూపొందుతుంది’’ అని అన్నారు. ‘‘ఎవరూ ధైర్యం చేయలేని కొత్త కథాంశాలను బోల్డ్‌గా, బ్యాలెన్స్డ్‌గా తెరకెక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని పలు చిత్రాలు నిరూపించాయి. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నప్పుడు పెద్ద సినిమాల మధ్య వచ్చినా విజయం అందిస్తారనే నమ్మకంతో వచ్చే నెల సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. 


Updated Date - 2021-11-25T23:25:01+05:30 IST