టాలీవుడ్ చిత్రాల్ని టెన్షన్ పెడుతున్న ‘డాక్టర్ స్ట్రేంజ్’
ABN , First Publish Date - 2022-05-03T19:52:14+05:30 IST
‘పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2’ లాంటి పాన్ ఇండియా సినిమాల్ని చూసి రచ్చ రచ్చ చేసిన జనం.. రాబోయే సినిమాల్లో కూడా అలాంటి హ్యూజ్ కంటెంట్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం విషయం లేని సినిమాల్ని నిర్మొహమాటంగా పక్కన పెడుతున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి తెరపై హడావిడి చేసినా.. ఎంగేజింగ్ అంశాలు లేకపోతే అంతే సంగతులు అని మరోసారి రుజువైంది.

‘పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2’ లాంటి పాన్ ఇండియా సినిమాల్ని చూసి రచ్చ రచ్చ చేసిన జనం.. రాబోయే సినిమాల్లో కూడా అలాంటి హ్యూజ్ కంటెంట్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం విషయం లేని సినిమాల్ని నిర్మొహమాటంగా పక్కన పెడుతున్నారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి తెరపై హడావిడి చేసినా.. ఎంగేజింగ్ అంశాలు లేకపోతే అంతే సంగతులు అని మరోసారి రుజువైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీన టాలీవుడ్ లో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’, శ్రీ విష్ణు ‘భళాతందనాన’ చిత్రాలు విడుదల వుతున్నాయి. ఈ మూడు సినిమాల ట్రైలర్స్ విడుదలయ్యాయి. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలకు అదే రోజు విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ హాలీవుడ్ మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్’ తో పెద్ద చిక్కొచ్చిపడింది. ఈ సినిమాకు ఇండియాలో క్రేజ్ మామూలుగా లేదు.
హైదరాబాద్ తో సహా కీలక నగరాల్లో డాక్టర్ స్ట్రేంజ్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. మూడు రోజులు వరుసగా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ‘డాక్టర్ స్ట్రేంజ్ : మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ చిత్రం టికెట్స్ భాషా బేధం లేకుండా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలకి ఈ సినిమానే బెటర్ చాయిస్ కానుంది. అయితే ఈ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా బతికి బట్టకట్టాలంటే.. అందులో సమ్ థింగ్ స్పెషల్ ఉండాలి. మరి ఈ మూడు సినిమాల్లో ఆడియన్స్ ను కూర్చో బెట్టకలిగే కంటెంట్ ఏముందో తెలియాలంటే.. మే6 వరకూ ఆగాల్సిందే.