తక్కువ అంచనా వేయొద్దు!

ABN , First Publish Date - 2021-11-20T06:33:44+05:30 IST

ఇది వరకు హీరోలదే రాజ్యం. కెమెరా ముందూ.. బయట. ముఖ్యంగా కమర్షియల్‌ సినిమా అనేసరికి.. కథంతా హీరో చుట్టూనే తిరిగేది. కథానాయిక పాత్ర కేవలం పాటలకు పరిమితమయ్యేది.....

తక్కువ అంచనా వేయొద్దు!

ఇది వరకు హీరోలదే రాజ్యం. కెమెరా ముందూ.. బయట. ముఖ్యంగా కమర్షియల్‌ సినిమా అనేసరికి.. కథంతా హీరో చుట్టూనే తిరిగేది. కథానాయిక పాత్ర కేవలం పాటలకు పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తమకెలాంటి ప్రాధాన్యం లేకపోతే... ఆ సినిమా చేయడానికి హీరోయిన్లు ముందుకు రావడం లేదు. ‘‘ఓ రకంగా ఇది మంచి పరిణామం’’ అంటోంది రష్మిక. కథల్లో కథానాయిక ప్రాఽధాన్యం గురించి రష్మిక మాట్లాడుతూ ‘‘ఇది వరకటి సంగతేమో గానీ, ఇప్పుడు హీరోయిన్లను ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ల పాత్రని తీర్చిదిద్దడంలో ఏమాత్రం అలసత్వం చూపించినా.. ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కథలో ప్రతీ పాత్రా కీలకమే. అలాంటప్పుడు హీరోయిన్లని పట్టించుకోకపోతే ఎలా?  అందుకే దర్శకులు, రచయితలు మాకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం పారితోషికాల గురించి ఆలోచించి సినిమాల్ని ఒప్పుకునే రోజులు పోయాయి. పాత్ర నచ్చితేనే ఏదైనా...’’ అంటూ తన అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పింది రష్మిక. 

Updated Date - 2021-11-20T06:33:44+05:30 IST