Katrina, Vicky Kaushal వెడ్డింగ్ : రాజస్థాన్‌లోని ‘ఆ జిల్లా’ కలెక్టర్ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2021-12-04T17:30:54+05:30 IST

కత్రీనా, విక్కీ కౌశల్ తమ పెళ్లి గురించి ఇంత వరకూ ఒక్క మాట కూడా అధికారికంగా మాట్లాడలేదు. కానీ, బాలీవుడ్ మొత్తం వారి వివాహం చర్చల్లోనే మునిగిపోయింది. తాజాగా ఓ పక్కా సమాచారం మాత్రం వచ్చింది. క్యాట్స్ వెడ్డింగ్‌కి ఎంత మంది అతిథులు రాబోతున్నారు, ఏయే తేదీల్లో వేడుకలు జరుగనున్నాయి వంటి ప్రశ్నలకు ఎట్టకేలకు అధికారిక జవాబులు దొరికాయి!

Katrina, Vicky Kaushal వెడ్డింగ్ : రాజస్థాన్‌లోని ‘ఆ జిల్లా’ కలెక్టర్ ఏమన్నారంటే...

కత్రీనా, విక్కీ కౌశల్ తమ పెళ్లి గురించి ఇంత వరకూ ఒక్క మాట కూడా అధికారికంగా మాట్లాడలేదు. కానీ, బాలీవుడ్ మొత్తం వారి వివాహం చర్చల్లోనే మునిగిపోయింది. తాజాగా ఓ పక్కా సమాచారం మాత్రం వచ్చింది. క్యాట్స్ వెడ్డింగ్‌కి ఎంత మంది అతిథులు రాబోతున్నారు, ఏయే తేదీల్లో వేడుకలు జరుగనున్నాయి వంటి ప్రశ్నలకు ఎట్టకేలకు అధికారిక జవాబులు దొరికాయి! 


విక్కీ కౌశల్ చేత కత్రీనా రాజస్థాన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో మూడు ముళ్లు వేయించుకోనుంది. దాని పేరు ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’. ఇది సవాయి మాధోపూర్ ప్రాంతంలో ఉంది. అక్కడి జిల్లా కలెక్టర్ విక్కీ, కత్రీనా వివాహం గురించి స్పందించారు. మొత్తం 120 మంది వీఐపీ గెస్టులు వేడుకలకి హాజరవుతారట. వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారేనని కూడా ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోని వారు ఉంటే వాళ్లు తప్పకుండా ‘ఆర్‌టీ పీసీఆర్’ టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ చూపాల్సి ఉంటుందట! ఏ ఒక్క అతిథికి కరోనా లేదని నిర్ధారణ అయ్యాకే పెళ్లి మంటపం వద్దకి అనుమతిస్తారు...


కత్రీనా కైఫ్ పెళ్లి వేడుకల తేదీల విషయంలోనూ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. జిల్లా కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం బిగ్ బాలీవుడ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 7 నుంచీ 10వ తేదీల మధ్య జరుగనున్నాయి. చూడాలి మరి, ‘విక్‌క్యాట్’ జంట నుంచీ ఆహ్వానం అందుకున్న ఆ 120 మంది నియర్ అండ్ డియర్ ఎవరో!

Updated Date - 2021-12-04T17:30:54+05:30 IST