డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’.. అందుబాటులోకి ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2021-12-16T02:34:50+05:30 IST

సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా? మరియు లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’.. అందుబాటులోకి ఎప్పుడంటే?

సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా? మరియు లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కాబోతోన్న ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు చెందిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్‌గా వస్తున్న ఈ ‘పరంపర’లో నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, జగపతిబాబు, శరత్ కుమార్ వంటి ప్రతిభావంతులైన తారాగణం నటించారు. శక్తి మరియు ప్రతీకారాలకు సంబంధించిన పురాణ గాథ చుట్టూ ఈ ‘పరంపర’ తిరుగుతూ ఉంటుందని, ఇది తెలుగు ప్రేక్షకులకు గతంలో ఎన్నడూ చూడని కోణంలో, సినిమా కన్నా చాలా భారీ స్థాయిలో చిత్రీకరించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో నటించడం.. తనకు దక్కిన గౌరవంగా శరత్ కుమార్ పేర్కొనగా.. నటుడిగా మరియు మనిషిగా నేను చాలా నేర్చుకునేందుకు ‘పరంపర’ అవకాశాన్ని కల్పించిందని జగపతిబాబు అన్నారు. మొట్టమొదటి వెబ్ సిరీస్‌ని ప్రతిభావంతులైన నటీనటులతో చేసినందుకు గర్వంగా ఉందని దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ తెలిపారు.   



Updated Date - 2021-12-16T02:34:50+05:30 IST