ఆధ్యాత్మిక మార్గం వైపు హీరోయిన్.. దర్శకులలో ఆందోళన
ABN , First Publish Date - 2022-01-25T03:10:01+05:30 IST
ఇటీవల ఆమె ఓ ఫొటో షూట్ నిర్వహించింది. సాధారణంగా ఆమె ఎపుడు ఫొటో షూట్ నిర్వహించినా టైట్ బనియన్, ఫ్యాంటు ధరించి ఫొటోకు ఫోజిస్తుంది. కానీ, ఈ దఫా అందుకు భిన్నంగా సంప్రదాయబద్ధమైన చీరకట్టులో ఫొటో
‘సూదు కవ్వుం’ చిత్రం ద్వారా తమిళ వెండితెరకు పరిచయమైన సంచితా షెట్టి ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇపుడామె హఠాత్తుగా ఆధ్మాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఎక్కువ సమయం ధ్యానంలో నిమగ్నమైవుంటున్న ఆమె గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు ససేమిరా అంటోంది. దీంతో ఆమె కమిట్ అయిన చిత్రాలకు చెందిన దర్శకులు తలలు పట్టుకుంటూ ఆందోళన చెందుతున్నారట.
ఇటీవల ఆమె ఓ ఫొటో షూట్ నిర్వహించింది. సాధారణంగా ఆమె ఎపుడు ఫొటో షూట్ నిర్వహించినా టైట్ బనియన్, ఫ్యాంటు ధరించి ఫొటోకు ఫోజిస్తుంది. కానీ, ఈ దఫా అందుకు భిన్నంగా సంప్రదాయబద్ధమైన చీరకట్టులో ఫొటో దిగింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ఇకపై ఇలాగే నటిస్తానని స్పష్టం చేయడంతో సంచిత కమిట్ అయిన చిత్రాల దర్శకులు ఏం చేయాలో పాలుపోవడం లేదట. పైగా ఈమె హఠాత్తుగా ఆధ్యాత్మికబాట పట్టడానికి కారణం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.