సిరివెన్నెల ఒక సాహిత్య పరిశోధకుడు : వైవియస్ చౌదరి

ABN , First Publish Date - 2021-12-01T15:47:24+05:30 IST

టాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న (మంగళవారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దర్శకుడు వైవియస్ చౌదరి. ‘తాను చదువుకున్న అనంతమైన సాహిత్యపు సారాన్ని, జీవితం పట్ల తనకున్న అపారమైన అవగాహనని మేళవించి.. రాసే ప్రతిపదం వెనుక ఎంతో గాఢమైన, లోతైన సారాన్ని, జ్ఞానాన్ని సందర్భోచితంగా నింపుతూ.. ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ.. పండితులను పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు (Lyrical Scientist) అయిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం.

సిరివెన్నెల ఒక సాహిత్య పరిశోధకుడు : వైవియస్ చౌదరి

టాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న (మంగళవారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దర్శకుడు వైవియస్ చౌదరి. ‘తాను చదువుకున్న అనంతమైన సాహిత్యపు సారాన్ని, జీవితం పట్ల తనకున్న అపారమైన అవగాహనని మేళవించి.. రాసే ప్రతిపదం వెనుక ఎంతో గాఢమైన, లోతైన సారాన్ని,  జ్ఞానాన్ని సందర్భోచితంగా నింపుతూ.. ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ.. పండితులను పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు (Lyrical Scientist) అయిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో) మరియూ ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం కలగటం నేను చేసుకున్న అదృష్టం. నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’ , ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలలోని అన్ని పాటలను Solo/Single Card Lyricist గా.. ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందగలగటం.. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారని విశ్వసిస్తున్నాను’. అని తెలిపారు వైవియస్ చౌదరి. 

Updated Date - 2021-12-01T15:47:24+05:30 IST