Sukumar : జక్కన్న బాటలో లెక్కల మాస్టారు ?

ABN , First Publish Date - 2022-09-13T16:48:46+05:30 IST

హీరోలు కోట్లల్లో పారితోషికం అందుకుంటుంటే.. వారి క్రేజ్ కు ముఖ్యకారకులైన దర్శకులు ఇంకెంత రెమ్యూనరేషన్ అందుకుంటారు? అని సాధారణ ప్రేక్షకులకు సందేహం కలగడం క్వైట్ కామన్. ఒకప్పుడు తెలుగు దర్శకులకు హీరోల కన్నా ఎక్కువ పారితోషికం దక్కేది కాదు.

Sukumar : జక్కన్న బాటలో లెక్కల మాస్టారు ?

హీరోలు కోట్లల్లో పారితోషికం అందుకుంటుంటే.. వారి క్రేజ్ కు ముఖ్యకారకులైన దర్శకులు ఇంకెంత రెమ్యూనరేషన్ అందుకుంటారు? అని సాధారణ ప్రేక్షకులకు సందేహం కలగడం క్వైట్ కామన్. ఒకప్పుడు తెలుగు దర్శకులకు హీరోల కన్నా ఎక్కువ పారితోషికం దక్కేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. హీరోల కన్నా దర్శకులకు ఎక్కువ రెమ్యూనరేషన్ గిట్టుబాటయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న దర్శకుడిగా రాజమౌళి (Rajamouli) నిలిచిపోతారు. తెలుగులోనే కాదు.. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడాయన. ఆయన సినిమా మొదలుపెడితే చాలు.. మొత్తం బిజినెస్ అయిపోతుంది. ఆయన ముద్ర పోస్టర్ మీదుంటే చాలు.. వ్యాపారం ఆటోమెటీగ్గా జరిగిపోతుంది. అయితే ఆయన సినిమాకి పారితోషికంగా కాకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటారు. 


ఒక్కో సినిమాకి రూ. 100 కోట్లకు పైగానే సంపాదిస్తున్నారు రాజమౌళి. పారితోషికంగా అందుకునే మొత్తం కన్నా ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకే ఈ వాటాల పద్ధతిని ఇప్పుడు చాలా మంది దర్శకులు ఫాలో అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కూడా హాసిని అండ్ హాసిని బ్యానర్‌లో వాటాదారుడే. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ (Sukumar) కూడా ఇదే ఫాలో అవుతున్నాడని టాక్. 


రీసెంట్‌గా ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో సుకుమార్ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా రెండో భాగానికి ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు సుక్కు పారితోషికం తీసుకోవడం లేదని వినికిడి. లాభాల్లో వాటాలు అందుకుంటున్నారు. అందుకే ‘పుష్ప 2’ (Pushpa 2)  కు పారితోషికం లేకుండానే పనిచేస్తున్నాడట సుకుమార్. ‘పుష్ప 2’ కు దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు టాక్. కనీసం 600 కోట్ల నుంచి 700 కోట్ల వరకూ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి 2, కేజీఎఫ్ 2’ చిత్రాల్లా పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అయితే.. దాదాపు రూ. 1000 కోట్లు రాబట్టొచ్చన్నది నిర్మాతల ఆలోచన. అదే జరిగితే ఈ సినిమా నుంచి సుకుమార్ రూ. 100 కోట్లు అందుకుంటాడు. అదీ లెక్కల మాస్టారి లెక్క.  

Updated Date - 2022-09-13T16:48:46+05:30 IST