స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్, అతడి భార్యకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-23T22:15:35+05:30 IST
తమిళ స్టార్ హీరో ధనుష్ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ జనవరి 23న కోవిడ్‌కు పాజిటివ్‌గా తేలారు.

తమిళ స్టార్ హీరో ధనుష్ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ జనవరి 23న కోవిడ్‌కు పాజిటివ్‌గా తేలారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనను ఈ మధ్య కలిసిన వారందరు తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరారు.
సెల్వ రాఘవన్ ట్విట్టర్‌లో ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘గుడ్ మార్నింగ్. నేను జనవరి 23న కోవిడ్‌కు పాజిటివ్‌గా తేలాను. గత రెండు, మూడు రోజులుగా నన్ను కలిసిన వారందరు తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి. దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను’’ అని అతడు తెలిపారు.
సెల్వ రాఘవన్ భార్య గీతాంజలి కూడా కరోనాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. గతంలో ‘7/G బృందావన కాలనీ, యుగానికి ఒక్కడు, ఎన్‌జికె’ వంటి డబ్బింగ్ చిత్రాలతో సెల్వ తెలుగు వారికి దగ్గరయ్యారు.