మెగా మేనల్లుళ్ళపై కన్నేసిన Kandireega డైరెక్టర్ ?

Twitter IconWatsapp IconFacebook Icon
మెగా మేనల్లుళ్ళపై కన్నేసిన Kandireega డైరెక్టర్ ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) హీరోగా నటించిన ‘కందిరీగ’ (Kandireega) సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శ్రీనివాస్ (Santosh Srinivas). తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత  ఆ సినిమాకి రామ్ తోనే సీక్వెల్ తీయాలని కొన్నేళ్ళు తెగ ప్రయత్నించాడు. అది వర్కవుట్ కాకపోవడంతో యన్టీఆర్ (NTR) తో ‘రభస’ (Rabhasa) చిత్రం తెరకెక్కించాడు. ఆశించిన రీతిలో సినిమా అలరించలేకపోయింది. ఆ తర్వాత తన తొలి చిత్ర హీరోతోనే ‘హైపర్’ (Hyper) మూవీ తీశాడు. ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందినప్పటికీ.. చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. అలా ఒక బ్లాక్ బస్టర్,  రెండు ఫ్లాపులతో తన కెరీర్ లాగిస్తున్న సంతోష్ కు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) తో ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adurs) తీశాడు. ఈ సినిమా కూడా సంతోష్ ఫ్లాపుల లిస్ట్ లోకి చేరిపోయింది.


అలా.. వరుస ఫ్లాప్స్ తో సరైన అకాశాలు అందుకోలేకపోతున్న సంతోష్ శ్రీనివాస్ .. ప్రస్తుతం మెగా మేనల్లుళ్ళపై కన్నేసినట్టు సమాచారం. సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) లేదా.. వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తో సినిమా తీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని టాక్. అయితే సాయిధరమ్ ఇప్పుడిప్పుడే తన కెరీర్ ను చక్కదిద్దుకుంటున్నాడు. ఆచితూచి కథల్ని, దర్శకుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సాయిధరమ్.. సంతోష్ శ్రీనివాస్ లాంటి ఫ్లాప్ దర్శకుడ్ని దగ్గరకు రానిస్తాడా అన్నది ప్రశ్న. అలాగే.. వైష్ణవ్ తేజ్ సైతం రెండో సినిమా ఫ్లాప్ అవడంతో.. ఇక నుంచి కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు.  కొత్తతరహా దర్శకుల్ని, విభిన్నతరహా కథల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్ని లైన్ లో పెడుతున్నాడు. ఆ కారణంగా వైష్ణవ్ కూడా సంతోష్ శ్రీనివాస్ తో ఇప్పట్లో సినిమా చేయడం కష్టం. మరి సంతోష్ తదుపరి చిత్రం ఏ హీరోతో చేస్తాడో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.