రాబోయే తరాలకు శాస్త్రిగారు ఒక ఇన్స్పిరేషన్ : రామ్ గోపాల్‌వర్మ

ABN , First Publish Date - 2021-12-01T16:20:26+05:30 IST

టాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న (మంగళవారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తూ ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సిరివెన్నెల మృతిపట్ల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సంతాపాన్ని తెలుపుతూ, ఆయనతో తన అనుబంధాన్ని, ఆయన పాటల గొప్పతనాన్ని ఆడియో రూపంలో తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వర్మ మాట్లాడుతూ...

రాబోయే తరాలకు శాస్త్రిగారు ఒక ఇన్స్పిరేషన్ : రామ్ గోపాల్‌వర్మ

టాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న (మంగళవారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సంతాపాన్ని తెలుపుతూ, ఆయనతో తన అనుబంధాన్ని, ఆయన పాటల గొప్పతనాన్ని ఆడియో రూపంలో తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వర్మ మాట్లాడుతూ...


‘సీతారామ శాస్త్రిగారితో నా ఫస్ట్ మెమరీ అన్నపూర్ణ స్డూడియోస్ లో నేనో చెట్టుకింద కూర్చుని సిట్యువేషన్ చెప్పి..  కాలేజ్ సాంగ్‌లో అసలు కవిత్వం గానీ, బుకిష్ వర్డ్స్ కానీ ఉండకూడదండీ.. మామూలు స్టూడెంట్స్ మాట్లాడుతున్న మాటల్లాగానే అనిపించాలి కానీ పాటలా అనిపించకూడదు. అని చెప్పిన తర్వాత సరిగ్గా రెండు, మూడు సెకండ్స్ లో ‘బోటనీ పాఠముంది.. మేటనీ ఆటఉంది. దేనికో ఓటు చెప్పరా’ అని స్టార్ట్ చేశారు.. ఆ తర్వాత నాకు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ‘అమ్మాయి ముద్దు ఇవ్వంది. ఈ రేయి తెల్లవారినివ్వనంతే’.. తర్వాత గాయంలో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’,  ఇవన్నీ నా మెమరీస్ లోకి వెళుతూ ఉంటే.. నాకే ఎన్ని పాటలు చెప్పాలి అని అనిపిస్తోంది. ఇక పోతే ఇప్పుడు జరిగిన ఘటన అఫ్‌కోర్స్ ఇట్ షాక్స్ టు ఎవ్రిబడీ.. కానీ నా ఫీలింగ్ ఏంటంటే.. ఒక మహా ఫిలాసఫర్ ఒకసారి ఏం చెప్పాడంటే.. ఏం జీవించినా.. అందరూ జీవిస్తారు.. కానీ కొంతమంది వారి జీవితంలో చేసినవి కొన్ని.. ముందు ముందు తరాల జీవితాలకి ఒక ఇన్స్పిరేషన్ గా, ఒక మార్గదర్శకంగా నిలిచిపోతాయి. సో.. ఒక వైపు నుంచి ఆయన చనిపోయినందుకు నాకు ఎంత బాధగా ఉన్నా.. ఆయన లైఫ్ టైమ్ లో ఆయన చేసినవన్నీ ఎప్పటికీ.. నిలిచిపోతాయి. అందరూ పోతారు.. మీరూ పోతారు.. నేనూ పోతాను. కానీ ఆయన జీవితంలో చేసినవన్నీ ఫ్యూచర్ జెనరేషన్ కి ఆల్మోస్ట్ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన్నొక ఇన్స్పిరేషన్ గా తీసుకునే రైటర్స్ ఉంటారు. ఆయన్ని కోట్ చేస్తారు. ఆయన పాటలు గుర్తు తెచ్చుకుంటారు. సో ఎవెన్షన్లీ అదీ పాయింట్. ఆయన భౌతికంగా దూరమైనాసరే ఆయన చేసిన వర్క్ ఎప్పటికీ బతికే ఉంటుంది. అన్న ఒక పాయింట్ నాకు ఆనందం కలిగిస్తోంది’... అంటూ వర్మ తెలిపారు.  



Updated Date - 2021-12-01T16:20:26+05:30 IST