ఆ పాట కోసం లతా మంగేష్కర్ 8 గంటలు నిలబడే ఉన్నారట..!

ABN , First Publish Date - 2022-01-27T16:33:51+05:30 IST

ఇటీవల కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తూ అందరిని ఆందోళనకి గురి చేస్తోంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం దీని బారిన పడి ఇబ్బందుల పాలవుతున్నారు...

ఆ పాట కోసం లతా మంగేష్కర్ 8 గంటలు నిలబడే ఉన్నారట..!

ఇటీవల కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తూ అందరిని ఆందోళనకి గురి చేస్తోంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం దీని బారిన పడి ఇబ్బందుల పాలవుతున్నారు. కొన్ని రోజుల క్రితం పాపులర్ గాయని లతా మంగేష్కర్‌కి కూడా కరోనా పాజిటివ్ రాగా.. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు.


అయితే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా లతా మంగేష్కర్ పాడిన ఓ సినిమా పాట గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అదే అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘రంగ్ దే బసంతి’లోని ‘లుకా చుప్పి’. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ సాధించడమే కాకుండా అందులోని పాటలు సైతం అందరిని ఆకట్టుకున్నాయి. అందులో ఈ పాట కూడా ఒకటి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దీన్ని స్వర పరచగా ఈ సినీయర్ గాయని పాడారు.


ఈ పాట రికార్డింగ్ కోసం లతా మంగేష్కర్ దాదాపు 8 గంటల పాటు నిలబడి ఉన్నారని ‘రంగ్ దే బసంతి’ డైరెక్టర్ రాకేశ్ ఓమ్ ప్రకాశ్ మెహ్రా వెల్లడించాడు. ఈ సినిమా విడుదలై పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అందరు సింగర్స్‌లా కాకుండా ఈ పాటని దాదాపు నాలుగు రోజుల పాటు ఆమె రిహార్సల్ చేసినట్లు తెలిపాడు. ఇంత డేడికేషన్ ఉన్న గాయనిని ఇంతవరకు చూడలేదని ఈ డైరెక్టర్ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. ఆ ఎమోషనల్ సాంగ్‌ని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2022-01-27T16:33:51+05:30 IST