Sukumar బాటలో పూరీ జగన్నాథ్ ?

ABN , First Publish Date - 2022-06-20T17:48:44+05:30 IST

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కు ఓ సుగుణముండేది. తను దర్శకుడిగా ఎంత బిజీ అయినప్పటికీ.. శిష్యుల్ని ప్రోత్సహించడం మరిచిపోలేదు ఆయన. తన కథలతో, తన నిర్మాణంలో ఎందరో నూతన దర్శకుల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో చిత్రాలు తీశారు.

Sukumar బాటలో పూరీ జగన్నాథ్ ?

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కు ఓ సుగుణముండేది. తను దర్శకుడిగా ఎంత బిజీ అయినప్పటికీ.. శిష్యుల్ని ప్రోత్సహించడం మరిచిపోలేదు ఆయన. తన కథలతో, తన నిర్మాణంలో ఎందరో నూతన దర్శకుల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో చిత్రాలు తీశారు. ఆయన ద్వారా వచ్చినంతమంది శిష్యులు మరే ఇతర దర్శకుడి నుంచీ రాలేదు. సరిగ్గా ఆయన లక్షణాల్ని కొద్దో గొప్పో పుణికిపుచ్చుకున్నాడు దర్శకుడు సుకుమార్ (Sukumar). టాలీవుడ్ లో ఇప్పటికే అతడు ఎస్టాబ్లిష్డ్ స్టార్ డైరెక్టర్. తన దర్శకత్వంలో పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ.. తన కథలతో, తన నిర్మాణంలో అతి తక్కువ బడ్జెట్‌తో తన శిష్యుల దర్శకత్వంలో సినిమాలు తీస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్ ద్వారా ఇప్పటికే కొందరు దర్శకులు పుట్టుకొచ్చారు. వారు తీసిన వాటిలో పలు చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు సుక్కు బాటలో పయనిస్తోన్న మరో దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath). 


దాసరి లాగానే అతి తక్కువ టైమ్ లో కథ రాయగల సత్తా పూరీకుంది. ఇప్పటికే ఆయన దగ్గర బౌండెడ్ స్ర్కిప్టులు చాలానే ఉన్నాయట. అవన్నీ ఆయనే తీయలేడు. తన సొంత నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ (Puri Connects) ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురావాలన్నది పూరీ ఆలోచన. ఇంతవరకు పూరీ తన బ్యానర్ లో కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ సినిమాలు తీశాడు కానీ.. ఈ సారి భారీ ఎత్తున ప్లా్న్ చేస్తున్నాడట. తన శిష్యులనే కాకుండా.. యంగ్ టాలెంట్ ను కూడా ప్రోత్సాహించాలనుకుంటున్నాడట. ఆ సినిమాలకు తనే కథ, మాటలు అందించబోతున్నాడట. ప్రస్తుతం ‘లైగర్ (Liger), జనగణమన (Janaganamana)’ చిత్రాల మేకింగ్ లో బిజీగా ఉన్న పూరీ..  అతి త్వరలోనే తన నిర్మాణంలో ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ప్రకటించబోతున్నాడట. మరి పూరీ కనెక్ట్స్ ద్వారా ఎంత మంది కొత్త దర్శకులు కనెక్ట్ అవుతారో చూడాలి. 

Updated Date - 2022-06-20T17:48:44+05:30 IST