సీనియర్‌ డైరెక్టర్ కన్నుమూత.. రోడ్డ పక్కన అనాథగా భౌతికకాయం!

ABN , First Publish Date - 2021-12-10T00:42:34+05:30 IST

భౌతికకాయాన్ని కొందరు గుర్తు పట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లేకుంటే అనాధ శవం కింద కార్పొరేషన్‌ సిబ్బంది శ్మశానానికి తరలించేవారే. ఈయన ప్రముఖ నటులు

సీనియర్‌ డైరెక్టర్ కన్నుమూత.. రోడ్డ పక్కన అనాథగా భౌతికకాయం!

‘వెట్రి మేల్‌ వెట్రి’, ‘మానగంకావల్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం.త్యాగరాజన్‌ అనాధగా రోడ్డు పక్కన ప్రాణాలు విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కొందరు గుర్తు పట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లేకుంటే అనాధ శవం కింద కార్పొరేషన్‌ సిబ్బంది శ్మశానానికి తరలించేవారే. ఈయన ప్రముఖ నటులు విజయ కాంత్‌, ప్రభు హీరోలుగా నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రభు హీరోగా నటించిన ‘వెట్రి మేల్‌ వెట్రి’, విజయకాంత్‌ హీరోగా ఏవీఎం నిర్మాణ సంస్థ నిర్మించిన ‘మానగర కావల్‌’ చిత్రాలకు ఈయనే దర్శకుడు. అరుబ్బుకోట ప్రాంతానికి చెందిన ఈయన.. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొందారు. 


అయితే, రెండు మూడు చిత్రాల తర్వాత ఈయనకు అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి సొంతూరికి వెళ్ళారు. అక్కడ ఒక ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన కోలుకుని మళ్ళీ చెన్నై వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఏవీఎం స్టూడియో సమీపంలో ఒక రోడ్డు పక్కన నివసించేవారు. ఆ ప్రాంతంలో ఉన్న అమ్మా క్యాంటీన్‌లో కడుపునింపుకునేవారని స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత కోలుకుని తిరిగి తాను ఉండే ప్రాంతానికి వెళ్ళారు. అయితే, ఆయన భౌతిక కాయం బుధవారం రోడ్డు పక్కన కనిపించడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

Updated Date - 2021-12-10T00:42:34+05:30 IST