ఈ సినిమా ‘హ్యాపీడేస్‌’కి సీక్వెల్‌లా ఉంటుందట!

ABN , First Publish Date - 2021-08-06T02:28:32+05:30 IST

ఐరావతం, కామధేను, కల్పవృక్షం వంటివాటితో సరిపెట్టుకున్నా... హాలాహలం ఉద్భవించినప్పుడు భయపడి ఆగిపోయినా.. ‘అమృతం’ ఆవిర్భవించేది కాదు. కష్టాలకు భయపడి ఆగిపోతే జీవన మకరందాన్ని ఆస్వాదించలేం. జీవితంలో ఏమీ సాదించలేమన్నదే

ఈ సినిమా ‘హ్యాపీడేస్‌’కి సీక్వెల్‌లా ఉంటుందట!

మానస్, సంజయ్ కుమార్, అక్షత సోనావని హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ పిక్చర్స్, ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘క్షీర సాగర మథనం’. ఈ చిత్రం శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ చిత్రానికి సీక్వెల్‌గా ఉంటుందని అన్నారు దర్శకుడు అనిల్ పంగులూరి. ఈ చిత్రం ఆగస్ట్ 6న విడుదల కాబోతోన్న సందర్భంగా ఆయన మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐరావతం, కామధేను, కల్పవృక్షం వంటివాటితో సరిపెట్టుకున్నా... హాలాహలం ఉద్భవించినప్పుడు భయపడి ఆగిపోయినా.. ‘అమృతం’ ఆవిర్భవించేది కాదు. కష్టాలకు భయపడి ఆగిపోతే జీవన మకరందాన్ని ఆస్వాదించలేం. జీవితంలో ఏమీ సాదించలేమన్నదే ‘క్షీర సాగర మథనం’ చిత్ర కథా సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పలు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఓ ఇరవై మంది మిత్రుల ప్రోత్సాహంతో.. ఈ చిత్రాన్ని రూపొందించాం. శేఖర్ కమ్ములగారి ‘హ్యాపీడేస్‌’కి సీక్వెల్ ఉంటుందీ చిత్రం. సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం చూసి స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్‌గారు నైతికంగా ఎంతో మద్దతు ఇచ్చారు. ఏడు పాత్రల తాలూకు భావోద్వేగ సంఘర్షణల మదనంతో వస్తోన్న ఈ చిత్ర విజయంపై ఎంతో ధీమాగా ఉన్నాం’’ అని తెలిపారు.

Updated Date - 2021-08-06T02:28:32+05:30 IST