వెట్రిమారన్‌ దర్శకత్వంలో?

వెట్రిమారన్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటించనున్నారా? అంటే... ‘అవును’ అని కోడంబాక్కమ్‌ టాక్‌. ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విక్రమ్‌’లో గ్యాంగ్‌స్టర్‌గా కమల్‌ నటిస్తున్నారు. దీని తర్వాత వెట్రిమారన్‌తో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారట. అవి ఓ కొలిక్కి వచ్చాయని సమాచారం. త్వరలో చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. ‘ఆడుకాలమ్‌’, ‘విసారణై’, ‘వడా చెన్నై’, ‘అసురన్‌’ చిత్రాలతో వెట్రిమారన్‌ పేరు తెచ్చుకున్నారు. జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆయనతో కమల్‌ ఎటువంటి సినిమా చేస్తారోననే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. సమాజంలో వర్ణవివక్ష, మనుషుల మధ్య అంతరాలను సహజంగా చూపిస్తూ సినిమాలు తీయడం వెట్రిమారన్‌ శైలి.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.