రవితేజ, దేవిశ్రీలకు సవాల్ విసిరిన ‘ఖిలాడి’ భామ

ABN , First Publish Date - 2022-01-28T00:49:34+05:30 IST

‘ఖిలాఢి’ మూవీ హీరోయిన్ డింపుల్ హయతి.. ఆ చిత్ర హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మరో హీరోయిన్‌లకు సవాల్ విసిరారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని

రవితేజ, దేవిశ్రీలకు సవాల్ విసిరిన ‘ఖిలాడి’ భామ

‘ఖిలాఢి’ మూవీ హీరోయిన్ డింపుల్ హయతి.. ఆ చిత్ర హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మరో హీరోయిన్‌లకు సవాల్ విసిరారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని, హైదరాబాద్ జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎమ్‌సి పార్క్‌లో మొక్కలు నాటిన డింపుల్ హయతి.. ఈ ఛాలెంజ్‌కు మరో నలుగురిని నామినేట్ చేశారు. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలి. నేను కూడా హీరో రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటి మీనాక్షి చౌదరికి ఈ ఛాలెంజ్ విసురుతున్నాను. మొక్కలు నాటి.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..’’ అని తెలిపారు.

Updated Date - 2022-01-28T00:49:34+05:30 IST