'ఖిలాడి' హీరోయిన్‌కి బాలీవుడ్ ఆఫర్స్..?

ABN , First Publish Date - 2021-07-04T17:11:58+05:30 IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'ఖిలాడి'. ఇందులో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న డింపుల్ హయాతికి బాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా, జయంతీలాల్ గడ సమర్పణలో దీనిని హిందీలో పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు.

'ఖిలాడి' హీరోయిన్‌కి బాలీవుడ్ ఆఫర్స్..?

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'ఖిలాడి'. ఇందులో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న డింపుల్ హయాతికి బాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా, జయంతీలాల్ గడ సమర్పణలో దీనిని  హిందీలో పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో డింపుల్ మీద బాలీవుడ్ మేకర్స్ దృష్టిపడిందట. క్రియేటివ్ జీనియస్ శంకర్ - రణవీర్ సింగ్ కాంబోలో పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న 'అపరిచితుడు' హిందీ రీమేక్‌లో ఈమె ఓపాత్ర పోషించనుందని బీ టౌన్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించబోతున్న మరో సినిమాలోనూ డింపుల్ హయతిని హీరోయిన్‌గా ఎంపికచేసుకున్నట్టు సమాచారం. త్వరలో వీటిపై అధికారక ప్రకటన రానుందట. 

Updated Date - 2021-07-04T17:11:58+05:30 IST