ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన సినీ జగత్తు ఉన్నంతవరకూ తన పేరు అందరూ గుర్తుంచుకునేంతటి పేరు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో దిలీప్ కుమార్ సినిమాల్లో వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. షారూఖ్ ఖాన్ లాంటి నటులు తమకు దిలీప్ కుమార్ ఎంతో స్పూర్తినిచ్చారని చెబుతుంటారు. దిలీప్ కుమార్కు బాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకూ క్రేజ్ ఉంది.
దిలీప్ కుమార్కు ఒకసారి హాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే ఆ సినిమాపై దిలీప్ అంతగా ఆసక్తి చూపలేదు. హాలీవుడ్ సినిమా లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటించేందుకు అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి డేవిడ్ లీన్ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ షరీఫ్ అలీ పాత్రను దిలీప్ కుమార్కు ఆఫర్ చేశారు. డేవిడ్ ఈ సినిమాలో ఫ్రిన్స్ ఫరీఫ్ పాత్రకు యూరోపియన్ నటుడిని కాకుండా దిలీప్ కుమార్ను ఎంపిక చేశారు. భారతీయ సినిమాలంటే ఇష్టం కలిగిన డేవిడ్ ఇందుకోసం దిలీప్ కుమార్ను సంప్రదించగా... తనకు హాలీవుడ్లో నటించాలనే ఉద్దేశం లేదని దిలీప్ అతనితో చెప్పారట. 1962లో జరిగిన ఆర్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ సినిమా ఏడు అవార్డులను దక్కించుకుంది.