బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్(98) ఈరోజ కన్నుమూశారు. నాటి రోజుల్లో దిలీప్ కుమార్, దేవికారాణిల జంట హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. ఈ సమయంలో దేవికారాణి ఒక రొమాంటిక్ హీరో(దిలీప్ కుమార్)కు యూసుఫ్ ఖాన్ అనే పేరు సూట్ కాదని భావించారట. ఇందుకోసమే ఆమె యూసుఫ్ ఖాన్‌కు కొత్త పేరును వెదికి, చివరికి దిలీప్ కుమార్ అని పెట్టారట. ప్రముఖ రచయిత అశోక్ రాజ్ తన పుస్తకం ‘హీరో’ లో రాసిన వివరాల ప్రకారం అప్పటి సాహితీవేత్త భగవతి చరణ్ వర్మ... దిలీప్ కుమార్ అనే పేరు సెలెక్ట్ చేశారు.
యూసుఫ్ ఖాన్ పేరును మార్చేందుకు దేవికారాణి... దిలీప్ కుమార్, వాసుదేవ్, జహంగీర్ అనే పేర్లను ఎన్నుకున్నారట. ఈ నేపధ్యంలో యూసుఫ్ ఖాన్ కూడా దిలీప్ కుమార్ పేరుకు మొగ్గు చూపారట. దిలీప్ కుమార్ తన ఆత్మకథలో తన పేరు మార్పు తనపై ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నారు. తాను హాలీవుడ్ కళాకారులు జెమ్స్ స్టీవర్ట్, పాల్ ముని, ఇంగ్రిడ్ బర్గ్‌మ్యాన్, క్లర్క్ గోబ్లే తదితరులు సినిమాలు చూసేవాడినని పేర్కొన్నారు. ఆరోజుల్లో సాటి హీరో అశోక్ కుమార్‌తో పోటీ పడిన దిలీప్ కుమార్ పలు భాషలు కూడా నేర్చుకున్నారు.