నేను డిస్ట్రిబ్యూటర్‌గా నిలబడడానికి హెల్ప్ చేసింది వారే: దిల్ రాజు

ABN , First Publish Date - 2021-07-27T01:59:28+05:30 IST

కరోనా ప్ర‌భావం అన్ని ఇండ‌స్ట్రీల‌పై ప‌డింది. చలన చిత్ర పరిశ్రమపై ఇంకా ఎక్కువ ప‌డింది. మూడు నెల‌ల త‌ర్వాత ఈ నెల 30న థియేటర్లలో విడుదలవుతోన్న రెండు సినిమాలు స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ పాండ‌మిక్‌ని గుర్తుపెట్టుకుని ప్రేక్ష‌కులు కూడా త‌ప్ప‌కుండా మాస్కులు

నేను డిస్ట్రిబ్యూటర్‌గా నిలబడడానికి హెల్ప్ చేసింది వారే: దిల్ రాజు

యంగ్ హీరో తేజ స‌జ్జ‌ా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు య‌స్‌.య‌స్‌. రాజు దర్శకత్వంలో మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం ‘ఇష్క్‌’. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాతలు తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘కరోనా ప్ర‌భావం అన్ని ఇండ‌స్ట్రీల‌పై ప‌డింది. చలన చిత్ర పరిశ్రమపై ఇంకా ఎక్కువ ప‌డింది. మూడు నెల‌ల త‌ర్వాత ఈ నెల 30న థియేటర్లలో విడుదలవుతోన్న రెండు సినిమాలు స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ పాండ‌మిక్‌ని గుర్తుపెట్టుకుని ప్రేక్ష‌కులు కూడా త‌ప్ప‌కుండా మాస్కులు వేసుకునే సినిమా చూడాలని కోరుకుంటున్నాను. నా బిగినింగ్ డేస్‌లో డిస్ట్రిబ్యూట‌ర్‌గా నేను నిల‌బ‌డ‌డానికి సూప‌ర్ గుడ్ ఫిలింస్ ఎన్వీ ప్ర‌సాద్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌, పార‌స్ జైన్‌గారు చేసిన హెల్ప్ మ‌రియు వాళ్లు  ప్రోత్సహించిన విధానం కాని ఎప్పటికీ గుర్తుంటుంది. నేను డిస్ట్రిబ్యూట‌ర్‌గా స‌క్సెస్ అయిన త‌ర్వాత ఆర్‌.బి. చౌదరిగారు త‌మిళం నుంచి చాలా సినిమాలు చేసేవారు. వారికి 90 శాతం స‌క్సెస్ రేట్ ఉండేది కాబ‌ట్టి వారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అని చాలా స్ట‌డీ చేసేవాన్ని. రామానాయుడుగారు, ఆర్ బి చౌదరిగారు ఇలా ఎవ‌రెవ‌రు క‌థ‌ల మీద మంచి గ్రిప్ ఉన్న ప్రొడ్యూస‌ర్స్ అని స్ట‌డీ చేసే.. నా ప్ర‌తి సినిమాకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. అలాంటి సూప‌ర్ గుడ్ ఫిలింస్‌లో వ‌స్తోన్న ఇష్క్ సినిమా ఈ నెల 30న విడుద‌ల‌వుతుంది. మంచి కంటెంట్ కాబ‌ట్టి రిజ‌ల్ట్ కూడా బాగా వ‌స్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను. మంచి సినిమా కాబట్టి త‌ప్ప‌కుండా అందరూ ఆద‌రిస్తార‌ని న‌మ్ముతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

Updated Date - 2021-07-27T01:59:28+05:30 IST