
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ హీరో, నిర్మాత అజయ్ దేవగణ్ కాంబినేషన్లో 'నాంది' హిందీ రీమేక్ తెరకెక్కబోతోంది. ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన 'నాంది' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాతో అల్లరి నరేష్ మంచి హిట్ అసందుకున్నాడు. న్యాయవ్యవస్థలోని లోపాలనే కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో కూడా ఈ చిత్రం తెలిపింది. సినిమాలో ఈ అంశమే ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించారు. ఇక 'నాంది' విడుదలైనప్పుడే చిత్రబృందను ప్రశంసించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హిందీ చిత్రాన్ని అజయ్ దేవ్ గణ్తో కలిసి మొదలు పెట్టబోతున్నా విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారక ప్రకటన ఇచ్చారు. ఇదే విషయాన్ని అజయ్ దేవగణ్ కూడా వెల్లడించారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారట. ఇక ఇప్పటికే 'జెర్సీ', 'హిట్', 'ఎఫ్ 2' చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు.