ఇంటివాడైన డైరెక్ట‌ర్ కార్తీక్ యోగి

‘డిక్కిలోనా’ చిత్ర దర్శకుడు కార్తీక్‌ యోగి ఓ ఇంటివాడయ్యాడు. విని షామునుతో ప‌రిమిత సంఖ్య‌లో హాజ‌రైన అతిథుల స‌మ‌క్షంలో ఈయ‌న వివాహం జ‌రిగింది. న‌టులు కాళి వెంకట్‌, కణ్ణన్‌ రవి, వత్సన్‌ తదితరులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా ఈ వివాహానికి హాజరుకాలేని సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు సంతానం మూడు పాత్రల్లో నటించిన చిత్రం ‘డిక్కిలోనా’. కార్తీక్ యోగి ఈ చిత్రాన్ని టైం ట్రావెల్‌ను ఇతివృత్తంగా చేసుకుని హాస్యభరితంగా తెరకెక్కించారు. 2027 సంవత్సరం నుంచి 2020 సంవత్సరానికి వచ్చిన ఓ యువకుడు తన వివాహాన్ని ఏ విధంగా అడ్డుకు నేందుకు టైం ట్రావెల్‌ చేస్తున్నట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేజేఆర్‌ స్టూడియోస్‌, సొల్‌జర్స్‌ ఫిలిమ్స్‌ ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కార్తీక్‌ యోగికి కోలీవుడ్‌లో మంచి గుర్తింపుతో పాటు పేరు కూడా వచ్చింది. ఇపుడు ఈయన తన బ్యాచిలర్‌ జీవితాన్ని ఫుల్‌స్టాప్‌ పెట్టి ఓ ఇంటివాడయ్యాడు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.