అతడికి నువ్వేమైనా నా నెంబర్ ఇచ్చావా..? నాకెందుకు ఫోన్ చేశాడు.. Prithviraj ను ఆరా తీసిన Dulquer Salmaan

మూవీ ప్రమోషన్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బాలీవుడ్ నుంచి ఈ ఒరవడి అనేక ఇండస్ట్రీలకు వ్యాపిస్తోంది. గతంలో ‘‘ గీత గొవిందం ’’ విడుదల సమయంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ట్విటర్‌లో ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. తాజాగా అటువంటి సంఘటనే మలయాళం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. ఒక హీరోకి తెలియని వారి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తనకు ఫోన్ చేసిన వ్యక్తికి నంబర్ ఎవరు ఇచ్చారని మరో హీరోని ప్రశ్నిస్తూ మూవీని ప్రమోట్ చేశారు.


మహానటి చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన నటుడు దుల్కర్ సల్మాన్‌. ఆయన ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో కనిపించారు. ఆయనకు ఒక తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనకు సీఐడీ రామదాస్ అనే వ్యక్తి ఫోన్ చేశారన్నారన్నారు. ‘‘ సీఐడీ రామదాస్ అనే వ్యక్తి నాకు ఎందుకు ఫోన్ చేశారు? ఆయనకు ఏం కావాలి? ’’ అంటూ ట్విటర్‌లో  పోస్ట్ చేశారు. ఆ పోస్టును మరొ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ట్యాగ్ చేశారు. ఆ ట్యాగ్‌కు పృథ్వీరాజ్ స్పందిస్తూ..‘‘ నిజం తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాలి. అది సీక్రెట్‌గా ఉంచాల్సిన విషయం ’’ అని చెప్పారు.


ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ భ్రమమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 7న థియేటర్లతో పాటు, అమెజాన్ ప్రైమ్‌లోను ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్‌ల మధ్య ట్విటర్‌లో చర్చ జరిగినట్టు కనిపిస్తోంది.


బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన అంధాదున్ రీమేకే  ‘‘భ్రమమ్’’ సినిమా. ఈ చిత్రంలో ఆయన ఒక అంధుడి పాత్రలో కనిపించనున్నారు. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్ దాస్ నటించారు. రాధికా ఆప్టే పాత్రలో రాశీఖన్నా కనిపించనున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.